MK Stalin : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ప్రధానిని తెల్ల తోలు (బ్రిటీష్ ) కప్పుకున్న పాలకుడు అంటూ మండిపడ్డారు.
కేరళలో జరిగిన సీపీఎం 23వ మహాసభలకు స్టాలిన్(MK Stalin) ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశం అభివృద్ది చెందాలంటే ముందు గ్రామాలు పురోభివృద్ధి సాధించాలన్నారు.
వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ కొందరి ప్రయోజనాల కోసం పని చేస్తున్న మోదీని తాను పాలకుడిగా గుర్తించనని స్పష్టం చేశారు. రాష్ట్రాల హక్కులను హరించాలని చూస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు.
రాష్ట్రాల బలపడితేనే దేశం ముందుకు సాగుతుందన్న వాస్తవాన్ని ఇంకా మోదీ గుర్తించక పోవడం దారుణమన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ కలలు కన్న భారత రాజ్యాంగం ఇప్పుడు ప్రమాదంలో పడిందన్నారు.
మోదీ రాజ్యాంగ వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు ఎంకే స్టాలిన్(MK Stalin). ప్రస్తుతం దేశంలో నెలకొన్న సర్వాధికార ఏకీకృత వ్యవస్థను సృష్టించాలని ఆనాటి ఆంగ్లేయులు కూడా అనుకోలేదని అన్నారు.
ఈ సందర్బంగా మోదీని ఎద్దేవా చేశారు సీఎం. భారత ప్రభుత్వ చట్టం 1919 లో నే రాష్ట్రాలు స్వయం పాలిత ప్రభుత్వాలుగా పేర్కొందని స్పష్టం చేశారు.
ఈ చట్టం ప్రకారం కేంద్రం దేశంలోని రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. పెత్తనం చెలాయించాలని చూస్తోందంటూ మండిపడ్డారు ఎంకే స్టాలిన్.
దేశంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలకు సంబంధించిన ఆదాయాన్ని జీఎస్టీ పేరుతో దోచుకుంటోందని ఆరోపించారు. కేంద్రం నుంచి రూ. 21 వేల కోట్లు తమిళనాడుకు రావాల్సి ఉందన్నారు.
తాను కేరళ సీఎం పినరయి విజయన్ ఎన్నటికీ తలవంచే ప్రసక్తి లేదని హెచ్చరించారు మోదీని.
Also Read : కోవిడ్ మార్గదర్శకాలు జారీ చేస్తాం