KCR : అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళుతోందన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రం రాదన్నారు. కానీ వచ్చింది. మొదట్లో ఎన్నో అనుమానాలు, ఇబ్బందులు. వాటన్నింటిని తట్టుకుని నిలబడ్డాం.
ఇవాళ ధాన్యాగారంలో ఇండియాలో టాప్ లో ఉన్నామన్నారు. విద్యుత్ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించామని చెప్పారు. అదే రీతిన తెలంగాణ న్యాయ శాఖ దేశానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు కేసీఆర్(KCR).
తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2.78 లక్షలు అని ఇటీవలే ఆర్బీఐ వెల్లడించిందని తెలిపారు. హైదరాబాద్ లోని గచ్చి బౌలిలో న్యాయాధికారుల సదస్సు జరిగింది.
ఈ సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ, ప్రధాన న్యాయమూర్తులు సతీశ్ చంద్ర శర్మ, ఏపీ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.
న్యాయ శాఖకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు తాము కృషి చేశామన్నారు. న్యాయ వ్యవస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణను ఆకాశానికి ఎత్తేశారు.
సీజేఐకి తెలంగాణ అంటే , తెలుగు వారంటే వల్లమాలిన అభిమానం అని పేర్కొన్నారు. జస్టిస్ రమణ కు హైదరాబాద్ తో విడదీయలేని బంధం ఉందన్నారు. ఇక్కడి విషయాలు బాగా తెలుసన్నారను.
సీజీఐ చొరవతో హైకోర్టు బెంచీలను 24 నుంచి 42కి పెంచారని ప్రశంసించారు సీఎం(KCR). గతంలో 780 పోస్టులు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులకు అదనంగా 1730 పోస్టులు మంజూరు చేసినట్లు వెల్లడించారు కేసీఆర్.
Also Read : కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం