Vivek Agnihotri : వివాదస్పద దర్శకుడిగా పేరొందిన వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) సంచలన ప్రకటన చేశాడు. కశ్మీర్ ఫైల్స్ పేరుతో సినిమా తీసి కాశ్మీరీ పండిట్ల ఊచకోత, వారి బాధలను తెర కెక్కించే ప్రయత్నం చేశాడు.
ఆ సినిమా విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీని తన భుజాలమీదకు ఎత్తుకుంది భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలు. కొన్ని రాష్ట్రాలు ఏకంగా కాశ్మీర్ ఫైల్స్ మూవీకి వినోద పన్ను కూడా మినహాయించాయి.
ఒక వర్గాన్ని సంతృప్తి చెందే విధంగా తీశారన్న ఆరోపణలు ఉన్నాయి. విదేశాల్లో ప్రదర్శించకుండా నిలిపి వేశారు. దీనిపై సంచలన కామెంట్స్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
ఇది ఫక్తు రాజకీయం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. దానికి తాము వినోద పన్ను ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి పారేశారు. ఇదే సమయంలో శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ నిప్పులు చెరిగారు.
మోదీ త్రయాన్ని ఏకి పారేశారు. ఈ తరుణంలో దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి (Vivek Agnihotri) ఇవాళ కీలక ప్రకటన చేశాడు. తాను ఇక ఢిల్లీ ఫైల్స్ మూవీ తీస్తానని వెల్లడించాడు.
ఇక నుంచి అదే పనిలో ఉంటానని పేర్కొన్నాడు డైరెక్టర్. తన తదుపరి చిత్రం అదే అవుతుందని తెలిపాడు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్ స్టా గ్రామ్ లో స్పష్టం చేశాడు.
కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఆదరించిన వారికి, అభిమానించి అక్కున చేర్చుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ఫైల్స్ తో మరికొన్ని నిజాలు చూపిస్తానని ప్రకటించాడు వివేక్ అగ్ని హోత్రి.
Also Read : ఎఫ్-3 మూవీలో బుట్టబొమ్మ హల్ చల్