Jitin Ram Manjhi :దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తున్న వారికి కోలుకోలేని రీతిలో షాకింగ్ కామెంట్స్ చేశారు బీహార్ మాజీ సీఎం జితిన్ రాం మాంఝీ(Jitin Ram Manjhi). రాముడు తమ దేవుడంటూ బీజేపీ భుజానికి ఎత్తుకుంది. రామాలయం నిర్మిస్తోంది.
ఇటీవలే దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు కొనసాగాయి. కొన్ని రాష్ట్రాలలో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలో అసలు రాముడు దేవుడే కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జితిన్ రాం మాంఝీ(Jitin Ram Manjhi).
అసలు ఆయన దేవడు ఎలా అయ్యాడంటూ ప్రశ్నించాడు. రాముడు అనేది దేవుడు కాదని అది కేవలం కల్పిత పాత్ర గా అభివర్ణించారు. రాముడి పాత్రను తులసీదాస్, వాల్మీకి తమ రాతల్లో క్రియేట్ చేశారంటూ ఎద్దేవా చేశారు జితిన్ రాం మాంఝీ.
వాల్మీకి రామాయణం గొప్పదని, అందులో నీతి , ధర్మం గురించి ఉందన్నారు. తమకు తులసీదాస్ , వాల్మీకి, ఇతర భారతీయ రచయితల పట్ల నమ్మకం, గౌరవం ఉందని స్పష్టం చేశారు.
కానీ తాము రాముడిని దేవుడంటే ఒప్పుకోమని కుండ బద్దలు కొట్టారు. ఎవరి నమ్మకాలు వారివని కానీ తమకు రాముడి పట్ల విశ్వాసం లేదన్నారు. ఈ దేశంలో రెండే కులాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు.
ధనవంతులు, పేదవాళ్లు అనే రెండు కులాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు జితిన్ రాం మాంఝీ. ఇదిలా ఉండగా ఓ కథను కూడా చెప్పారు మాజీ సీఎం. శబరి ఎంగిలి చేసిన పండ్లను రాముడు తిన్నాడంటూ మరో కామెంట్ చేశారు.
ఇప్పుడు జితిన్ రాం మాంఝీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దేశ వ్యాప్తంగా కాషాయ వర్గాలు భగ్గుమంటున్నాయి.
Also Read : హార్దిక్ పటేల్ కు ఆప్ ఆహ్వానం