Raj Nath Singh : చైనాకు రాజ్ నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

హాని క‌లిగించాల‌ని చూస్తే ఊరుకోం

Raj Nath Singh :భార‌త దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న చైనాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ దేశం ప‌ట్ల చైనా కానీ లేదా ఇత‌ర దేశం ఏదైనా కానీ హాని త‌ల‌పెట్టాల‌ని చూస్తే స‌హించ‌బోమంటూ స్ప‌ష్టం చేశారు.

ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన నాయ‌కుల‌లో భార‌త ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఒక‌ర‌ని పేర్కొన్నారు. భార‌త్ ఇప్పుడు వ‌ర‌ల్డ్ లో టాప్ 3లో కొన‌సాగుతోంద‌న్నారు.

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్ కో ఇండియ‌న్ – అమెరిక‌న్ క‌మ్యూనిటీని ఉద్దేశించి ప్ర‌సంగించారు. తాము చేతులు ముడుచుకుని కూర్చోవ‌డం లేద‌న్నారు.

ప్ర‌స్తుతం భార‌త దేశం అవ‌లంభిస్తున్న విదేశాంగ విధానం చూసి మిగ‌తా దేశాలు విస్తు పోతున్నాయ‌ని తెలిపారు. తాము ఎవ‌రితో యుద్దాన్ని కోరుకోమ‌ని, శాంతి త‌మ అభిమ‌త‌మ‌ని స్ప‌ష్టం చేశారు. కానీ కాద‌ని కాలు దువ్వితే మాత్రం త‌గిన రీతిలో బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

జీరో స‌మ్ గేమ్ భార‌త్ అనుస‌రించ బోద‌న్నారు రాజ్ నాథ్ సింగ్(Raj Nath Singh). ఇది ఒక్క చైనాకే కాదు అమెరికాకు కూడా వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. భార‌త్ కాన్సులేట్ త‌న గౌర‌వార్థం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు రక్ష‌ణ శాఖ మంత్రి.

ఈ సంద‌ర్భంగా చైనా స‌రిహ‌ద్దుల్లో భార‌త ద‌ళాలు చూపిన ధైర్య సాహ‌సాల‌ను ప్ర‌స్తావించారు. భార‌త్ కు హాని క‌లిగిస్తే విడిచి పెట్ట‌మ‌న్నారు.

ఉక్రెయిన్ వార్ కార‌ణంగా ర‌ష్యాకు సంబంధించి అమెరికా ఒత్తిడి గురించి నేరుగా ప్ర‌స్తావించ‌కుండానే జీరో స‌మ్ గేమ్ పై న‌మ్మ‌కం లేద‌న్నారు.

Also Read : ఇమ్రాన్ ఖాన్ కాదు కామెడీ ఖాన్

Leave A Reply

Your Email Id will not be published!