Gourav Vallabh : కాశ్మీర్ ఫైల్స్ మూవీ తీవ్ర వివాదాలకు దారి తీసింది. ఒక వర్గాన్ని కించ పరిచేలా ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ , శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ , మాజీ సీఎంలు ఫరూఖ్ అబ్దుల్ , మెహబూబా ముఫ్తీ నిప్పులు చెరిగారు.
ఇక దిగ్గజ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ఏకంగా ఇది సినిమాయే కాదని మండిపడ్డారు. ఈ తరుణంలో కాశ్మీర్ ఫైల్స్ భారీ ఎత్తున భుజానికి ఎత్తుకుంది భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలు.
దీనిని కూడా ఎన్నికల ప్రచారానికి వాడుకునే ప్రయత్నం చేశారు. దీనిని తీసింది వివేక్ అగ్నిహోత్రి. ఆయన సెన్సార్ బోర్డు మెంబర్ గా ఉన్నారు. ఆయన తనకు తాను హిందూ వాదినంటూ ప్రకటించుకున్నారు.
ఇక కంగనా రనౌత్ అయితే బ్రాండ్ అంబాసిడర్ గా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్రధాని దీనిని ప్రమోట్ చేయడాన్ని కాంగ్రెస్ తప్పు పట్టింది. తాజాగా వివేక్ అగ్ని హోత్రి మరో ప్రకటన చేశారు.
తాను ఢిల్లీ ఫైల్స్ తీస్తున్నానంటూ ప్రకటించాడు. దీనిపై కాంగ్రెస్ ఫైర్ అయ్యింది. వివేక్ ను బీజేపీ ప్రాయోజిత నిర్మాత అంటూ సంచలన ఆరోపణలు చేశాడు ఆ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్(Gourav Vallabh).
ధైర్యం ఉంటే గుజరాత్ కాలి పోతున్నప్పుడు సీఎం ఏం చేస్తున్నారో , హోం మంత్రి ఏం చేశారో ఆధారాలతో సహా ఇస్తా సినిమా తీయాలంటూ సవాల్ విసిరారు.
గుజరాత్ లో చోటు చేసుకున్న దారుణాల గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా అంటూ ప్రశ్నించారు.
Also Read : ఇండియా ద్రవ్యోల్బణం పైపై