Satya Pal Malik : మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు రైతుల పక్షాన ఉంటానని స్పష్టం చేశారు. పదవి ఉన్నా లేక పోయినా తన మతం , అభిమతం రైతుల సంక్షేమమని ప్రకటించారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిలదీస్తూనే ఉంటానని ప్రకటించారు. ఈ పోరాటంలో తన గవర్నర్ పదవి పోయినా భయపడనని వెల్లడించారు.
నేను మొదటి నుంచి రైతుల పక్షం. వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించినా నిలదీస్తా. అవసరమైతే ప్రశ్నిస్తా. నిజాయితీ నా వంట్లో ఉంటుంది.
నా లైఫ్ స్టైల్ అంత. మాజీ ప్రధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్ నేను రాజకీయంగా శిక్షణ తీసుకున్నానని సత్య పాల్ మాలిక్(Satya Pal Malik) చెప్పారు. ఆయన పదే పదే నాకు చెప్పింది ఒక్కటే.
ఈ దేశంలో కోట్లాది మందికి ప్రాణభిక్ష పెడుతున్నది, ఆకలిని తీరుస్తున్నది రైతులే. వ్యవసాయం రంగంపై ఆధారపడిన వాళ్లు 80 శాతానికి పైగా ఉన్నారని చెప్పారు.
అందుకే రైతుల కోసం పోరాడాలని, వారి తరపున గొంతు వినిపించాలని తనకు బోధించారని తెలిపారన్నారు. అవసరమైతే దేనినైనా వదులుకునేందుకు సిద్దంగా ఉండాలని చెప్పారని అందుకే తాను అన్నదాతల కోసం ఆక్రోషిస్తున్నానని తెలిపారు సత్య పాల్ మాలిక్.
ఇదిలా ఉండగా ఆయన కొన్ని నెలల నుంచి రైతుల పక్షాన ఉంటూ మాట్లాడుతున్నారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కేంద్రంపై నిప్పులు కూడా చెరిగారు. సాగు చట్టాలు రద్దు చేసినా కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందేనంటున్నారు మేఘాలయ గవర్నర్.
Also Read : ప్రతి ఇంటికి 300 యూనిట్ల కరెంట్ ఫ్రీ – సీఎం