Gas Cylinder Blast : కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం
పేలిన గ్యాస్ సిలిండర్ పరుగులు తీసిన జనం
Gas Cylinder Blast : కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హార్బర్ కు సమీపంలో ఉన్న ఓ టీ కొట్టులో గ్యాస్ సిలిండర్(Gas Cylinder Blast) పేలిపోయింది. భారీ ఎత్తున శబ్దం రావడంతో మత్స్యకారులు భయంతో పరుగులు తీశారు.
ఇదిలా ఉండగా ప్రమాదానికి సమీపంలోని హార్బర్ పెట్రోల్ బంక్ ఉంది. కానీ ప్రమాదానికి సమీపంలోనే హార్బర్ పెట్రోల్ బంక్ కూడా ఉన్నా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు.
ప్రస్తుతం పెద్ద ఎత్తున ఎగసి పడుతున్న మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చుట్టు పక్కల ఎవరూ ఉండకుండా చర్యలు చేపట్టారు.
ప్రస్తుతానికి ఏమంత ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ ముందు జాగ్రత్తగా ఎవరూ ఆ పరిసరాల్లోకి వెళ్లకుండా చూశారు. ఇదిలా ఉండగా కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్న ఈ ఘటనపై ఆరా తీశారు సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి.
ప్రమాదానికి గల కారణాలు వివరించారు ఉన్నతాధికారులు. ఏమైన ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందా అని వాకబు చేశారు. అలాంటిది ఏమీ లేదని సిలిండర్ పేలడం (Gas Cylinder Blast)వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు.
ప్రస్తుతం పరిస్థితి అంతా అదుపులోనే ఉందని వెల్లడించారు.
Also Read : మహా నేత ఆశీస్సుల వల్లే మంత్రి పదవి