Bengal Bypolls : బెంగాల్ ఉప ఎన్నిక‌ల్లో టీఎంసీ హ‌వా

బీహార్ లో లాలూ పార్టీ జ‌య‌కేత‌నం

Bengal Bypolls : ప‌శ్చిమ బెంగాల్ లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు ఘ‌న విజ‌యం సాధించారు. ఇక బీహార్ లో లాలూ యాద‌వ్ పార్టీ గెలుపొంద‌డం విశేషం.

దేశ వ్యాప్తంగా అల్ల‌ర్ల‌కు కేరాఫ్ గా మారిన బెంగాల్ లో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఎక్కువ ఫోక‌స్ ఉండింది. వాట‌న్నింటిని ప‌టాపంచ‌లు చేస్తూ జ‌నం దీదీపై న‌మ్మ‌కం ఉంచారు.

ఈ రోజు జ‌రిగిన ఓట్ల లెక్కింపు జ‌ర‌గింది. మొత్తం ఐదింటికి ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. అసన్ సోల్ లోక్ స‌భ , బ‌ల్లిగంజ్ అసెంబ్లీ స్థానాల‌ను టీఎంసీ కైవ‌సం చేసుకుంది.

అస‌న్ సోల్ లో ప్ర‌ముఖ న‌టుడు శ‌త్రుఘ్న సిన్హా విజ‌యం సాధించారు. ఇక బ‌ల్లిగంజ్ లో ప్ర‌ముఖ సింగ‌ర బాబుల్ సుప్రియో జ‌య‌కేత‌నం(Bengal Bypolls) ఎగుర వేశారు.

ఇక బీహార్ లో లాలూ యాద‌వ్ పార్టీకి చెందిన అభ్య‌ర్థి గెలుపొందారు. ఛ‌త్తీస్ గ‌ఢ్ , మ‌హారాష్ట్ర‌ల‌లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు.

ఈ మొత్తం ఐదు ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఇక అస‌న్స్ ల్ లో శ‌త్రుగ్న సిన్హాను, బాలిగంజ్ లో బాబుల్ సుప్రియోను గెలిపించినందుకు టీఎంసీ చీఫ్‌, బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ(Bengal Bypolls) ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ విజ‌యం ప్ర‌జ‌లు త‌న‌కు ఇచ్చిన గొప్ప బ‌హుమ‌తిగా భావిస్తాన‌ని తెలిపారు. ఇక లాలూ ప్ర‌సాద్ నేతృత్వంలోని రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ బీహార్ లోని బోచాహ‌న్ అసెంబ్లీ సెగ్మెంట్ లో 36 వేల ఓట్ల ఆధిక్యంతో విజ‌యం సాధించింది. ఖైరాగ‌డ్ , కొల్హా పూర్ ల‌లో స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త ల‌భించింది కాంగ్రెస్ కు.

Also Read : ప‌ద‌వి పోయినా ప్ర‌శ్నించ‌డం మాన‌ను

Leave A Reply

Your Email Id will not be published!