DC vs RCB IPL 2022 : ఉత్కంఠ పోరాటం ఆర్సీబీదే విజ‌యం

చేజేతులారా ఓడిపోయిన‌ ఢిల్లీ కేపిట‌ల్స్

DC vs RCB  : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో జ‌రిగిన ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన లీగ్ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అద్భుత‌మైన రీతిలో విజ‌యం సాధించింది. 16 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

190 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్(DC vs RCB )నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 173 ప‌రుగులే చేసింది. ఆసిస్ స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్ మ‌రోసారి రాణించాడు.

ఆర్సీబీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. అత‌డే డీసీలో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. మొత్తం 66 ప‌రుగులు చేశాడు. ఇక కెప్టెన్ రిష‌బ్ పంత్ 34 ర‌న్స్ చేసి హిట్టింగ్ కోస‌మ‌ని వెళ్లి పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు.

ఆఖ‌రున శార్దూల్ ఠాకూర్ ఆశ‌లు పెంచినా బౌల‌ర్ల ధాటికి చేతులెత్తేసింది ఢిల్లీ కేపిట‌ల్స్ . ఇక ఆర్సీబీ బౌల‌ర్ల‌లో హాజిల్ వుడ్ అద్భుతంగా రాణించాడు. మూడు కీల‌క వికెట్లు తీశాడు.

ఇక హైద‌రాబాదీ స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ 2 వికెట్లు తీస్తే హ‌స‌రంగా ఒక వికెట్ తీశాడు. అత్యధిక ప‌రుగులు ఇచ్చాడు లంక బౌల‌ర్. కాగా ధాటిగా ఆడుతున్న వార్న‌ర్ ను వెన‌క్కి పంపించాడు హ‌స‌రంగా. ఎల్బీగా వెనుదిరిగాడు.

38 బంతుల్లో 66 ర‌న్స్ చేసిన వార్న‌ర్ 4 ఫోర్లు 5 సిక్స‌ర్లు కొట్టాడు. అంత‌కు ముందు దినేశ్ కార్తీక్ దుమ్ము రేపాడు. మ‌రోసారి స‌త్తా చాటాడు. 34 బంతులు ఆడి 5 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో 66 ర‌న్స్ చేశాడు.

ఇక రిష‌బ్ పంత్ ఫుల్ ఫామ్ లో ఉన్న స‌మ‌యంలో ఫోర్ వెళుతున్న బంతిని క‌ళ్లు చెదిరే క్యాచ్ ప‌ట్టారు విరాట్ కోహ్లీ.

Also Read : శ‌త‌క్కొట్టిన రాహుల్ ల‌క్నో బిగ్ స్కోర్

Leave A Reply

Your Email Id will not be published!