Boris Johnson : బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ భారత్ కు రానున్నారు. ఉక్రెయిన్ – రష్యా యుద్దం జరుగుతున్న సమయంలో తటస్థ వైఖరి అవలంభిస్తోంది భారత దేశం.
ఈ తరుణంలో యుకె పీఎం రానుండడం ప్రధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే చైనా , రష్యా విదేశాంగ శాఖ మంత్రులు ఇండియాకు వచ్చారు.
ఇదే సమయంలో భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికాలో పర్యటించారు. ఈనెల 21న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) ఇండియాకు రానున్నారు.
రెండు రోజుల పాటు ఉంటారు. ఆయన పర్యటనను ఖరారు చేసింది యూకే ప్రధాన మంత్రి కార్యాలయం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.
వ్యూహాత్మక రక్షణ, దౌత్యం, ఆర్థిక భాగస్వామ్యంపై 22న లోతైన చర్చలు జరుపనున్నారు. ఈ విషయాన్ని భారత ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ధ్రువీకరించింది.
నిరంకుశ ధోరణిని అనుసరిస్తున్న దేశాల నుంచి శాంతి, శ్రేయస్సు అనేది ముఖ్యం. ప్రజాస్వామ్యయుత దేశాలు స్నేహంగా కలిసి ఉండడం అత్యంత అవసరమని అభిప్రాయ పడ్డారు పీఎం బోరిస్ జాన్సన్(Boris Johnson).
బ్రిటీష్ నాయకుడిగా భారత్ కు రావడం ప్రధాన్యత సంతరించుకుంది. బ్రిటన్ రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించింది. కానీ భారత్ మాత్రం తటస్థ వైఖరి అవలంభించింది.
కొన్ని దేశాలు భారత్ ను తప్పు పట్టాయి. ప్రధానంగా అమెరికా రష్యా నుంచి ఆయిల్ తీసుకోవడంపై అభ్యంతరం తెలిపింది. దానిని తిప్పి కొట్టింది ఇండియా.
Also Read : భారతీయులు ఎంబసీని సంప్రదించాలి