Mukthar Abbas Naqvi : దేశంలో ప్రజలు ఏం తినాలో ఏం తినకూడదో అన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పదన్నారు దేశ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ. అది తమ పని కాదని స్పష్టం చేశారు.
మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్లోందంటూ విపక్షాలు మండి పడుతున్నాయి. భారతీయులకు తమ విశ్వాసాన్ని ఆచరించే స్వేచ్ఛ ఉందని, మత వర్గాల మధ్య అసహనం పెరగడం లేదని పేర్కొన్నారు.
వివిధ ప్రాంతాల్లో మత పరమైన అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి స్పందించారు. న్యూ ఢిల్లీలో హిందూ మత పరమైన ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
ఈ ఘటన, అల్లర్లలో 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. మరో మూడు రాష్ట్రాలలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకోవడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది.
దీనిని తప్పు పడుతూ బీజేపీపై నిప్పులు చెరిగాయి ప్రతిపక్షాలు. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు అబ్బాస్ నఖ్వీ(Mukthar Abbas Naqvi).
దేశంలో శాంతి, శ్రేయస్సును జీర్నించు కోలేని వారు భారతీయ సంస్కృతిని కించ పరిచేందుకు యత్నిస్తున్నాయంటూ ఆరోపించారు. మత పరమైన ఊరేగింపుల సందర్బంగా హిందూ, ముస్లింల మధ్య అల్లర్లు చోటు చేసుకున్నాయి.
శ్రీరామ నవమి సందర్భంగా హాస్టల్ లో మాంసాహారం అందించడంపై జేఎన్ యూ లో గొడవ చోటు చేసుకుంది. ఈ సందర్బంగా నఖ్వీ మాట్లాడుతూ ప్రజలకు ఏం తినాలో ఏం తినకూడదనేది ప్రభుత్వం చెప్పదన్నారు. ఎ
వరికి వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
Also Read : పీకేకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్