TS TET 2022 : ప్రభుత్వ నిర్వాకం కారణంగా గత కొన్నేళ్లుగా టెట్ పరీక్ష(TS TET 2022) నిర్వహించక పోవడంతో ఈసారి విడుదల చేసిన ప్రకటనకు అభ్యర్థులు పోటెత్తారు. ప్రభుత్వ పరంగా టీచర్ పదవి పొందాలంటే తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) పాస్ కావాల్సిందే.
లేక పోతే డీఎస్సీ పరీక్ష రాసేందుకు అర్హులు కారు. దీంతో ఈ టెట్ (TS TET 2022)కు ఎక్కడ లేనంత డిమాండ్ నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే టెట్ ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేసేందుకు ఎగబడిన నేతల్లాగా తయారైంది.
ఈనెల 12 తో టెట్ పరీక్ష దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసింది. మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షకు ఎప్పుడూ లేనంతగా రద్దీ ఏర్పడింది.
మొత్తం 6 లక్షల 29 వేల 352 దరఖాస్తులు వచ్చాయి. టెట్ లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ -1 , పేపర్ -2 . గతంలో బీఇడి పూర్తి చేసిన వారికి టీటీసీ చేసిన వారితో పోటీ ఉండేది కాదు.
కానీ ఈసారి రెండు పేపర్లకు పర్మిషన్ ఇవ్వడంతో అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు పోటీ పడ్డారు. ఇదిలా ఉండగా పేపర్ -1 కి రాసే వారి సంఖ్య 3 లక్షల 51 వేల 468 దరఖాస్తు చేసుకోగా పేపర్ -2 కోసం రాసే వారి సంఖ్య 2 లక్షల 77 వేల 884 మంది అప్లై చేసుకున్నారు.
ఇదిలా ఉండగా టెట్ కు భారీ పోటీ ఏర్పడడంతో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన అభ్యర్థులకు లాస్ట్ లో ఎగ్జామ్ సెంటర్లు లేక పోవడం పై మండిపడ్డారు. ఇదిలా ఉండగా విద్యా శాఖ తీరుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఒకేసారి రెండు డిగ్రీలు చదివేందుకు ఓకే