Ashish Mishra : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ లఖింపురిఖేరి ఘటనలో కీలక నిందితుడిగా పేర్కొన్న కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా(Ashish Mishra )బెయిల్ ను రద్దు చేసింది సుప్రీంకోర్టు.
దీంతో కోలుకోలేని షాక్ తగిలింది. వారం రోజుల్లో జైలుకు రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఎన్నికలకు ముందు అరెస్ట్ అయిన ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
దీనిని సవాల్ చేస్తూ బాధిత రైతు కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ సందర్భంగా ఈ కేసు విచారణ చేపట్టింది భారత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.
ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. గత ఫిబవ్రి 10న బెయిల్ మంజూరు చేయడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఆశిష్ మిశ్రా(Ashish Mishra )తండ్రి అజయ్ మిశ్రా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో శక్తివంతమైన నాయకుడిగా చెలామణి అవుతున్నారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరు వాదనలు స్వీకరించింది. కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇటువంటి క్రిమినల్ విచారణ ప్రక్రియలో బాధితులకు హద్దులేని భాగస్వామ్య హక్కు ఉందని పేర్కొనడం గమనార్హం. బాధితులకు సమర్థవంతమైన విచారణకు అవకాశం లేకుండా నిరాకరించారని తాము భావిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.
బెయిల్ పిటీషన్ ను ప్రత్యేక బెంచ్ విచారించాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. సాక్షులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆశిష్ మిశ్రా బెయిల్ ను రద్దు చేయాలని రైతుల కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి.
ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని తమపై దాడికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ బాధితులు వాపోయారు.
Also Read : టెన్నిస్ ప్లేయర్ మృతిపై స్టాలిన్ దిగ్భ్రాంతి