FIR Karnataka : కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ను రాజీనామా చేయడమే కాదు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ , మాజీ సీఎం సిద్దరామయ్య ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
సీఎం బసవరాజ్ బొమ్మై ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం మంత్రి ఈశ్వరప్ప ఆయన అనుచరులేనని ఆరోపించారు.
ఈ మేరకు మంత్రి, అనుచరులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. డీకేఎస్, సిద్దరామయ్యతో పాటు రణదీప్ సూర్జేవాలా , ఇతర కాంగ్రెస నేతలపై కేసు నమోదు చేశారు.
ఈ మేరకు ఎఫ్ఐఆర్ లో వీరిందరి పేర్లు ఉండడం షాక్ ఇచ్చింది. కాంట్రాక్టర్ మృతిపై నిరసనల మధ్య గత వారం రాజీనామా చేసిన బీజేపీకి చెందిన కేఎస్ ఈశ్వరప్ప ను (FIR Karnataka )అరెస్ట్ చేయాలని ఇంకా డిమాండ్ చేస్తున్నారు.
ఏప్రిల్ 13న ముఖ్యమంత్రి రేస్ కోర్స్ రోడ్ నివాసంలో చట్ట విరుద్దమైన సమావేశంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. గత మంగళవారం ఉడిపి హోటల్ లో శవమై కనిపించిన కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు పురికొల్పినట్లు ఈశ్వరప్పపై ఆరోపణలు వచ్చాయి.
తన సూసైడ్ నోట్ లో పాటిల్ 40 శాతం కమీషన్ అడిగారని ఆరోపించారు. మంత్రిని అరెస్ట్ చేయాలని కోరుతూ కాంగ్రెస్ గత వారం రాష్ట్ర రాజధాని నగరం బెంగళూరులో భారీ నిరసనలు ప్రారంభించింది.
సీఎం ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులకు నిరసన, ఆందోళన చేసే హక్కు లేదని మండిపడ్డారు.
Also Read : బాధితులు వినే హక్కును నిరాకరించారు