Babul Supriyo : పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో బాలీగంజ్ నుంచి టీఎంసీ ఎమ్మెల్యేగా ప్రముఖ సింగర్, మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో(Babul Supriyo) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తనకు పోటీగా నిలిచిన సీపీఎం , బీజేపీ పార్టీలను ఎత్తి చూపారు.
ఇక్కడ పోటీ చేసిన సుప్రియో తన సమీప సీపీఎం అభ్యర్థి సైరా షా హలీమ్ పై 20 వేల 228 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఇక్కడ ఏదో పొడుస్తానంటూ ప్రగల్భాలు పలికింది. కానీ ఆ పని చేయలేక పోయింది. ఏకంగా మూడో ప్లేస్ తో సరి పెట్టుకుంది. ఇక వర్గ సమాజం అంటూ నిత్యం నీతి సూత్రాలు వల్లె వేసే సీపీఎం రెండో స్థానానికే పరిమితం అయి పోయిందని ఎద్దేవా చేశారు.
మొత్తంగా తన విజయానికి కారణం తన పనితీరేనంటూ పేర్కొన్నారు. ప్రధానంగా తాము ప్రజలకు చేసిన సేవలే తమను గెలిపించాయంటూ తెలిపారు బాబుల్ సుప్రియో. ఇప్పుడు చెప్పండి వర్గరహిత సమాజం ఎక్కడుందోనంటూ ప్రశ్నించారు.
హలీమ్ పై నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు వారంతా అబద్దాలను, అసత్యాలను ప్రచారం చేశారంటూ మండిపడ్డారు సుప్రియో. వారు చేసిన ప్రచారాన్ని బాలీగంజ్ వాసులు నమ్మలేదు.
వారికి చెంప ఛెల్లుమనిపించేలా తీర్పు చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ పనై పోయిందని, దానికి మతం తప్ప మరో మార్గం లేదన్నారు.
ఎంత సేపూ వివాదాలు సృష్టించడం ఆ తర్వాత లబ్ది పొందాలని చూడడమంటూ మండిపడ్డారు బాబుల్ సుప్రియో.
Also Read : కర్ణాటకలో త్వరలో మంత్రివర్గ విస్తరణ