Achalpur Curfew : దేశంలో పలు ప్రాంతాలలో ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మధ్య ప్రదేశ్ , యూపీ, కర్ణాటక, ఢిల్లీ ఇప్పుడు మహారాష్ట్రలో సైతం రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
దీంతో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. మహారాష్టలోని అమరావతి జిల్లాలోని అచ్ పూర్ (Achalpur Curfew)నగరంలో మత పరమైన జెండాలను తొలగించే విషయంలో ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు.
ఘర్షణకు దారి తీయడంతో కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు తెలిపారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాల్సి వచ్చిందని సమాచారం.
ఆదివారం అర్ధరాత్రి ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 22 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు అదనపు పోలీస్ సూపరింటెండెంట్ శశికాంత్ సతావ్ వెల్లడించారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. అయితే ఈ ఘటనలో గాయపడిన వారి సంఖ్య ఇంకా వెల్లడించ లేదు. అమరావతి జిల్లా కేంద్రానికి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది అచల్ పూర్.
దాని ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఖిడ్కీ గేట్ , దుల్హా గేట్ పై నివాసితులు ప్రతి ఏటా పండుగల సందర్భంగా వివధ మతాలకు చెందిన జెండాలను ఏర్పాటు చేస్తారని పోలీసులు తెలిపారు.
కొంత మంది సంఘ వ్యతిరేక శక్తులు ఓ మతానికి చెందిన జెండాలను తొలగించారు. ఇది వాగ్వాదానికి దారి తీసింది. చివరకు రాళ్ల దాడి వరకు సాగింది. గుంపును చెదర గొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకు వచ్చారు.
Also Read : మట్టిని కాపాడుకుంటేనే మనుగడ