Prashant Kishor : ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ , ఐపాక్ చీఫ్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. వరుసగా ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం ఇది మూడో సారి.
ఇవాల్టి సమావేశంలో ఈ ఏడాది చివరలో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంతే కాకుండా వచ్చే ఏడాది కర్ణాటక, ఛత్తీస్ గఢ్ , మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ రాష్ట్రాల ఎన్నికల ఎజెండాగా బ్లూ ప్రింట్ తయారు చేశారు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor).
మిషన్ 2024 పై ప్రశాంత్ కిషోర్ శనివారం వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. ఇప్పటి వరకు పీకే తయారు చేసిన నివేదికపై పరిశీలించేందుకు సోనియా గాంధీ కమిటీని ఏర్పాటు చేశారు.
ఇందులో పొందు పర్చిన గేమ్ ప్లాన్ గురించి ఈ కమిటీ చర్చించింది. గత మూడు రోజుల్లో వరుసగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్.
మరోసారి సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది. ఇందులో భాగంగా పీకేను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించడం జరిగిందని తెలిపారు.
ఇక ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్ , రణ్ దీప్ సింగ్ సూర్జే వాలా, కేసీ , అంబికా సోనీ హాజరయ్యారు.
370 స్థానాలలో ఒంటరిగా పోటీ చేయాలని, మిగతా సీట్లలో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని పీకే సూచించారు. దీనికి సోనియా ఓకే చెప్పినట్లు సమాచారం.
Also Read : ఢిల్లీ హింసపై అమిత్ షా సీరియస్