KTR : ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు కేంద్ర సర్కార్ పై. ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టిన మోదీకి దేశ ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు.
ఓ వైపు ద్రవ్యోల్బణం ఇంకో వైపు నిరుద్యోగం పెరిగి పోతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారో ఈ దేశ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా దేశంలో 15 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నా ఈరోజు వరకు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు.
ట్విట్టర్ వేదికగా ఆయన మండిపడ్డారు. కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న విధానాలు అత్యంత దారుణంగా ఉన్నాయంటూ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాను ఆయన విశ్లేషిస్తూ ఎద్దేవా చేశారు.
మోదీకి ఓ విజన్ అంటూ లేకుండా పోయిందన్నారు. ఈ దేశం కోసం ఏం చేస్తున్నారో చెప్పడం లేదన్నారు. కుల, మతాల పేరుతో రాజకీయాలు చేయడం తప్పా దేశ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు.
ఎలాంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో తెలియడం లేదన్నారు. దేశంలో ఏకంగా ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టానికి చేరిందని ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని ఇక గ్యాస్ గురించి చెప్పాల్సిన పని లేదన్నారు. ఇంధన ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం విజయోత్సవాలను నిర్వహించడం దారుణమని మండిపడ్డారు కేటీఆర్(KTR).
ఏదో ఒక రోజు ప్రజలు తప్పనిసరి బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ఇలాగే వ్యవహరిస్తూ పోతే భారత దేశం మరో శ్రీలంక కావడం ఖాయమని హెచ్చరించారు మంత్రి.
Also Read : ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా దొరికిన సినీ ప్రముఖులు