Jahangirpuri Clashes : ఢిల్లీ ఘర్షణలో కీలక నిందితుడి అరెస్ట్
23 మంది అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడి
Jahangirpuri Clashes : దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్ పురి లో చోటు చేసుకున్న ఘర్షణలో కీలకంగా భావిస్తున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్బంగా జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది పోలీసులు , ఓ సాధారణ పౌరుడు సహా మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు.
ఇందులో ఓ మహిళ, ఇద్దరు మైనర్లు సహా 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాక్ వెస్ట్ ఢిల్లీలోని జంగీర పురి సి – బ్లాక్ చుట్టూ శనివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య ఘర్షణలు (Jahangirpuri Clashes)చోటు చేసుకోవడంతో ఢిల్లీ పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా భావిస్తున్న అన్సార్, అస్లాంలను మంగళవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఘర్షణలకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు వారిని విచారించడం ప్రారంభంచారు.
ఈ మేరకు సమగ్ర నివేదికను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమర్పించారు. ఏర్పాటు చేసిన అరెస్ట్ లు , బందాల గురించి నివేదిక పేర్కొంది.
అరెస్ట్ చేసిన ఇద్దరు బాల నేరస్థులను కూడా వెల్లడించింది. వారిద్దరిని జువెలియన్ కోర్టు వద్ద హాజరు పరిచారు. ఇదిలా ఉండగా అన్సార్ (Jahangirpuri Clashes) గొడవలకు పాల్పడ్డాడా లేక ఎవరి సూచనల మేరకు ప్రవర్తించాడా అనే కోణంలో దర్యాప్తు చేసేందుకు అతడి కాల్ రికార్డుల కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.
అస్లాంకు తుపాకీ అందించిన హిస్టరీ షీటర్ పేరు విచారణ వెలుగులోకి వచ్చింది. కులం, మతంతో సంబంధం లేకుండా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానా.
Also Read : మనీ లాండరింగ్ అత్యంత ప్రమాదం