Sanjay Raut : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో చోటు చేసుకుంటున్న అల్లర్లకు, ఘర్షణలకు ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీనేనని మరోసారి నిప్పులు చెరిగారు.
ప్రధానంగా ఎన్నికల సమయంలోనో లేదా ఎన్నికల జరిగే ముందు ఇలాంటివి చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు కంటిన్యూగా జరుగుతూ వెళితే భారత దేశం మరో శ్రీలంక తయారవుతుందని హెచ్చరించారు సంజయ్ రౌత్(Sanjay Raut).
దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందన్నారు. దేశంలోని ప్రధాన నగరాలలోనే ఎందుకు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని ప్రశ్నించారు.
ఢిల్లీ, కర్ణాటక, మధ్య ప్రదేశ్ , యూపీలో చోటు చేసుకున్న ఘటనల్ని ఈ సందర్భంగా ఉదహరించారు శివసేన ఎంపీ. జహంగీర్ పురిలో చోటు చేసుకున్న ఘటనలో 23 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో మైనర్లు ఉండడం గమనార్హం.
సంజయ్ రౌత్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. సాక్షాత్తు రాజధానిలో అల్లర్లు జరగడం బాధాకరమన్నారు. ఢిల్లీని కేంద్రం పాలిస్తోందంటూ ఆరోపించారు సంజయ్ రౌత్(Sanjay Raut).
త్వరలో ఢిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయని అందుకే ఈ అల్లర్లు జరుగుతున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ. మరాఠాలో బీజేపీకి పవర్ లేదని అందుకే లౌడ్ స్పీకర్ల అంశాన్ని లేవనెత్తారంటూ మండిపడ్డారు.
బీజేపీయేతర రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ కేంద్ర సర్కార్ యత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు సంజయ్ రౌత్. తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇక బీజేపీ, శివసేన పార్టీల మధ్య మాటల యుద్దం నెలకొంది.
Also Read : సోనియాతో ప్రశాంత్ కిషోర్ భేటీ