Rahul Gandhi : అది ‘యూనియ‌న్ ప్ర‌చార‌క్ సంఘ్ క‌మిష‌న్’

యూపీఎస్సీ చైర్మ‌న్ ఎంపికపై రాహుల్ ఫైర్

Rahul Gandhi : దేశంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే నియామ‌క సంస్థ‌గా యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస క‌మిష‌న్ (యూపీఎస్సీ)కి పేరుంది. ప్ర‌స్తుతం అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ కాషాయీక‌ర‌ణ చేసే ప్ర‌య‌త్నంలో బిజీగా ఉంది కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం.

ప్ర‌స్తుతం యూపీఎస్సీ చైర్మ‌న్ గా భార‌తీయ జ‌న‌తా పార్టీ, రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ కు, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి స‌న్నిహితుడిగా పేరొందిన మ‌నోజ్ సోనీని నియ‌మించారు.

దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాద్దాంతం చెల‌రేగింది. ఎలాంటి రాజ‌కీయ పార్టీలు, సంస్థ‌ల‌కు సంబంధం లేని వ్య‌క్తుల‌ను చైర్మ‌న్ గా నియ‌మించాల్సి ఉంటుంది.

కానీ భార‌త రాజ్యాంగానికి పూర్తి విరుద్దంగా కేంద్ర స‌ర్కార్ కాషాయ పార్టీ, అనుబంధ సంస్థ‌తో సంబంధం ఉన్న వ్య‌క్తిని ఎలా నియ‌మిస్తారంటూ నిప్పులు చెరుగుతున్నారు ప్ర‌జాస్వామిక‌వాదులు, మేధావులు, బుద్ది జీవులు, ప్ర‌తిప‌క్షాలు.

తాజాగా చైర్మ‌న్ పోస్టులో మ‌నోజ్ సోనీని నియ‌మించ‌డంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi). అది యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కాద‌ని యూనియ‌న్ ప్ర‌చార‌క్ సంఘ్ క‌మిష‌న్ అంటూ ఎద్దేవా చేశారు.

ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి సంస్థ‌ల‌ను కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం నిర్వీర్యం చేస్తూ వ‌స్తోందంటూ ఆరోపించారు. రాను రాను ఈ దేశం ఎటు పోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).

గుజ‌రాత్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీకి ప్ర‌సంగాలు రాసి పెట్టే వారు. దీంతో ఎంఎస్ యూనివ‌ర్శిటీకి వీసీగా ఎంపిక‌య్యారు. కాషాయానికి అనుకూల నిర్ణ‌యాలు తీసుకుని న‌వ్వుల పాల‌య్యారు.

Also Read : బీజేపీపై శివ‌సేన ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!