KCR : దేశంలో ఎక్కడా లేని రీతిలో దళిత బంధును తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తోందని, ఇందుకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు సీఎం కేసీఆర్.
ఈ సందర్బంగా ఇప్పటి వరకు రోజుకు 400 వందల మంది చొప్పున 25 వేల మంది లబ్దిదారులను గుర్తించడం జరిగిందని సీఎంకు వివరించారు సీఎం కార్యదర్శి రాహుల్ బొజ్జా. మంగళవారం సీఎం కేసీఆర్(KCR )ప్రగతి భవన్ లో వ్యవసాయ శాఖతో పాటు ఇతర సంక్షేమ పథకాలపై సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ప్రభుత్వం ముందస్తుగా దళిత బంధు కింద ముందస్తుగా నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు.
ఇందులో భాగంగా ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా, వేగవంతంగా , పారదర్శకంగా అమలు చేసేందుకు త్వరలోనే ఆయా జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు సీఎం.
అంతే కాకుండా తాను ప్రవేశ పెట్టిన ఈ దళిత బంధు గురించి దేశంలోనే కాదు ఇతర దేశాల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు కేసీఆర్.
ఈ పథకం ద్వారా దళితులలో ఆత్మ గౌరవం ఇనుమడిస్తుందని, సమాజంలో మరింత ఉన్నతంగా బతికే అవకాశాలను అంది పుచ్చుకుంటారని చెప్పారు సీఎం.
ఇందు కోసం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడిగా మారి తిరిగి లాభాలను తీసుకు వచ్చేలా చేస్తుందన్నారు. ఏడాదికి 2 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే టార్గెట్ గా పెట్టుకుందన్నారు కేసీఆర్.
Also Read : తెలంగాణ రైతులకు విద్యుత్ షాక్