Ram Nath Kovind : డీఎంసీ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
3 మున్సిపల్ కార్పొరేషన్లను ఏకం చేసే బిల్లు
Ram Nath Kovind : కేంద్ర సర్కార్ తాను అనుకున్నట్టుగానే చేస్తూ పోతోంది. బీజేపీయేతర రాష్ట్రాలలో కయ్యానికి కాలు దువ్వుతోంది. వింటే ఓకే లేదంటే ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ వస్తోంది.
తాజాగా మోదీ త్రయం ప్రతిదానికీ ఆప్ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది. తాజాగా ఢిల్లీలోని 3 మున్సిపల్ కార్పొరేషన్లను ఏకం చేసే బిల్లకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ram Nath Kovind)ఆమోదం తెలిపారు.
ఇదిలా ఉండగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) బిల్లు -2022 ఈ చట్టాన్ని మార్చి 30న లోక్ సభ లో , ఏప్రిల్ 5న రాజ్యసభ ఆమోదించింది.
దేశ రాజధానిలోని మూడు పౌర సంస్థలను ఏకం చేసేందుకు ఉద్దేశించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లుకి రాష్రపతి ఆమోదం తెలిపారు. పార్లమెంట్ చట్టం 18 ఏప్రిల్ 2022న రాష్ట్రపతి ఆమోదాన్ని పొందింది.
సాధారణ సమాచారం కోసం దీని ద్వారా ప్రచురించబడింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) చట్టం -2022 నం. 10 ఆఫ్ 2022 అని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
చట్టం ప్రకారం ఢిల్లీలోని మున్సిపల్ కార్పొరేషన్ల ఏకీకరణ సమీకృత, వ్యూహాత్మక ప్రణాళిక, వనరుల సరైన వినియోగాన్ని నిర్దారిస్తుంది.
రాజ్యసభలో చట్టంపై చర్చలకు సమాధానం ఇస్తూ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పౌర సంస్థలకు సవతి తల్లిగా వ్యవహరించడం కారణంగా ఈ చర్య తప్పదనిసరి అని కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
ఈ బిల్లు రాజ్యాంగానికి లోబడి ఉంది. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో చట్టాలను రూపొందించే అధికారం కేంద్రానికి ఉంది. ఈ బిల్లు ఏ కోణంలో చూసినా సమాఖ్య నిర్మాణంపై దాడి కాదన్నారు.
Also Read : అది ‘యూనియన్ ప్రచారక్ సంఘ్ కమిషన్’
tq so much