BC Nagesh : కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇతిహాసాలను పాఠాలుగా ఇక నుంచి చదవాల్సిందేనంటూ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యా శాఖ శాఖ మంత్రి బీసీ నగేష్(BC Nagesh) ప్రకటించారు.
ఇందులో భాగంగా రామాయణం, మహా భారతం, ఖురాన్ , బైబిల్ నైతిక శాస్త్రంలో భాగంగా ఉంటాయని వెల్లడించారు మంత్రి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల, సలహా కమిటీ నిర్ణయిస్తుందని వెల్లడించారు.
అయితే ఈ నైతిక శాస్త్రానికి సంబంధించి ఎలాంటి పరీక్షలు అంటూ ఉండవని తెలిపారు బీసీ నగేష్(BC Nagesh) . ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం నుంచి నైతిక శాస్త్రం పాఠ్యాంశాల్లో భాగం అవుతుందని స్పష్టం చేశారు.
కేవలం ఒక మతానికి మాత్రమే పరిమితం కాదన్నారు. పంచతంత్రం, రామాయణం, మహాభారతం, ఖురాన్ తో పాటు అన్ని మతాలకు సంబంధించిన సారాంశం నైతిక అధ్యయనాల్లో భాగంగా ఉంటుందన్నారు కర్ణాటక ప్రాథమిక , మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పేర్కొన్నారు.
పాఠ్యాంశాలు ఏవేవి ఉండాలో ఉండకూడదనే దానిని కమిటీ నిర్ణయిస్తుందన్నారు. మదరసాలు లేదా మైనార్టీ కమ్యూనిటీల నుంచి డిమాండ్ లేనప్పటికీ ఇతర పాఠశాలలో మాదిరిగా మదర్సా స్టూడెంట్స్ కు కూడా విద్యను అందించాలని వారి పేరెంట్స్ కోరారని తెలిపారు.
దీని ద్వారా ఇతర విద్యార్థులతో వారు పోటీ పడతారని చెప్పారు. ఇలా చదువు కోవడం వల్ల ప్రొఫెషనల్ కోర్సులు, పోటీ పరీక్షలకు వారు కూడా హాజరు అయ్యేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నారు బీసీ నగేష్.
Also Read : తెలంగాణ టెట్ కు దరఖాస్తుల వెల్లువ