Kumar Vishwas Mann : ఆప్ మాజీ నేత , ప్రముఖ కవిగా పేరొందిన కుమార్ విశ్వాస్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా పంజాబ్ , ఢిల్లీ సీఎంలు భగవంత్ మాన్ , అరవింద్ కేజ్రీవాల్ పై నిప్పులు చెరిగారు.
తన ఇంటి ముందు పంజాబ్ కు చెందిన పోలీసులు ఉండడాన్ని తప్పు పట్టారు. ఈమేరకు ఆ ఫోటోలను షేర్ చేశారు. ఇదేనా మీరు ఎన్నుకున్న ప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నించారు .
ఆప్ పార్టీ వ్యవస్థాపకుల్లో కుమార్ విశ్వాస్ ఒకరు. ఆయన మంచి కవి కూడా . అద్భుతమైన పదాలతో సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో దిట్ట కూడా.
కుమార్ విశ్వాస్ ను తనంతకు తాను ఆప్ నుంచి వెళ్లి పోయేలా చేశారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. ఈ విషయాన్ని విశ్వాస్(Kumar Vishwas Mann) పదే పదే ప్రస్తావిస్తూ ఆరోపణలు చేస్తుంటారు.
పంజాబ్ ప్రజలు పాలన సాగించేందుకు పవర్ ఇచ్చారు. దానిని అడ్డం పెట్టుకుని మీ ఇద్దరు నాతో ఆడు కోవాలని చూస్తే సహించ బోనంటూ హెచ్చరించారు కుమార్ విశ్వాస్.
ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కుమార్ విశ్వాస్ ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేశారు. ఆయనపై వివాదాస్పద, సంచలన ఆరోపణలు చేశారు.
ఖలిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ కామెంట్ చేయడంతో కేంద్ర సర్కార్ స్పందించింది. ఈ మేరకు కేసు నమోదు చేసింది. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ కుమార్ విశ్వాస్(Kumar Vishwas Mann) స్పష్టం చేశారు.
తాజాగా పంజాబ్ పోలీసుల వాహనం తన ఇంటి ముందు తచ్చట్లాడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : జహంగీర్ పురిలో కూల్చివేత నిలిపివేత