Airtel Jio : వ్యాపార పరంగా అన్ని రంగాలలో తనదైన ముద్ర కనబరుస్తూ ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా దూసుకు పోతోంది ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.
ఇక టెలికం విషయానికి వస్తే రోజుకో ప్లాన్ లతో ఇతర కంపెనీలకు చుక్కలు చూపిస్తూ వస్తోంది. ఇక రిలయన్స్ ఐడియాస్ మామూలుగా ఉండవు. పక్కా వ్యాపారమే.
ఒకవేళ తాను ఎంత పెద్దటి స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించినా నష్టం వచ్చిందంటే వెంటనే మూసి వేయడమే. మరో మాట వెనక్కి చూసుకోవడం, రివ్యూ చేయడం అంటూ ఉండదు.
అయితే ఆది నుంచీ గట్టి పోటీని ఇస్తూ వస్తోంది భారతీ మిట్టల్ సారథ్యంలోని ఎయిర్ టెల్. జియో (Airtel Jio )ఎంతగా ప్రయత్నం చేసినా ఎయిర్ టెల్ చందాదారుల్ని (యూజర్లు) తమ వైపు తిప్పుకోలేక పోతోంది.
ఒక్కసారి ఎయిర్ టెల్ వాడడం మొదలు పెడితే వారి సర్వీస్ అద్భుతంగా ఉంటుందన్న నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఇక తాజా విషయానికి వస్తే దేశంలో టెలికం చందాదారుల సంఖ్య ఏకంగా 116.6 కోట్లకు దాటింది.
ఇది ఓ రికార్డు అని చెప్పక తప్పదు. టెలికాం రెగ్యులేటరీ యాక్ట్ (ట్రాయ్ ) ప్రకారం చాలా రాష్ట్రాలలో మొబైల్ యూజర్లు తగ్గారు. ఇదే సమయంలో బ్రాబ్ బ్యాండ్ కు చెందిన సబ్ స్క్రైబర్ల కు సంబంధించి చూస్తే ఎలాంటి మార్పు లేక పోవడం గమనార్హం.
జియో, వొడాఫోన్ ఐడియా కస్టమర్లను పోగొట్టుకుంటే ఎయిర్ టెల్ మాత్రం కొత్త వారిని చేర్చుకుని వాటికి షాక్ ఇచ్చింది. కొత్తగా 15.91 లక్షల మందిని చేర్చుకోవడం విశేషం.
Also Read : ఉండేందుకు స్వంత గూడు లేదు