Gautam Adani : బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన అధికారిక పర్యటన నిమిత్తం రెండు రోజుల పాటు ఇండియాలో కొలువు తీరారు. ఇవాళ ఆయన నేరుగా అహ్మదాబాద్ కు చేరుకున్నారు. అక్కడ బోరిస్ జాన్సన్ కు ఘన స్వాగతం పలికారు.
అక్కడి నుంచి నేరుగా భారత జాతిపిత మహాత్మా గాంధీ నివసించిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ గాంధీ, భార్య కలిసి ఉపయోగించిన చరఖాను చూశారు.
ప్రధానమంత్రి సైతం నూలు తీశారు. ఈ సందర్భంగా సందర్శన పుస్తకంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు బోరిస్ జాన్సన్. భారత దేశం గర్వించ దగిన మానవుడు గాంధీ అని, ఆయన బోధించిన శాంతి ప్రపంచానికి ఓ దిక్సూచి లాంటిదని పేర్కొన్నారు.
అనంతరం గుజరాత్ లో ఏర్పాటు చేసిన భారీ జేసీబీ తయారీ ప్లాంట్ ను సందర్శించారు బోరిస్ జాన్సన్ . ఈ సందర్భంగా భారత దేశ ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ బ్రిటన్ పీఎంతో సమావేశం అయ్యారు.
ఇదిలా ఉండగా గుజరాత్ ను సందర్శించిన మొట్ట మొదటి బ్రిటన్ ప్రధాని జాన్సన్ కావడం విశేషం. ఆయనకు ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు అదానీGautam Adani). ఈ సందర్భంగా బోరిస్ జాన్సన్ ను కలుసు కోవడం చాలా ఆనందగా ఉందన్నారు అదానీ.
పునరుత్పాదక, గ్రీన్ హెచ్ 2, కొత్త ఇంధనంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. వాతావరణం, సుస్థిరత ఎజెండాకు మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు అదానీ. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Also Read : విప్రో బిజినెస్ హెడ్ గా సత్య ఈశ్వరన్