Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన రోజుకొక బాంబు పేల్చుతున్నారు. నిన్నటి దాకా తన పదవి పోయేందుకు ప్రధాన కారణం అమెరికా అని ఆరోపించిన ఖాన్ ప్రస్తుతం ఇంకో సంచలన ఆరోపణ చేశారు.
తాను చైనాతో స్నేహంగా ఉండడం వల్లనే తట్టుకోలేక కొన్ని విదేశీ శక్తులు తను వెళ్లి పోయేలా చేశాయంటూ ఆరోపించారు. లాహోర్ లో నిర్వహించిన సభలో ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ప్రసంగించారు.
ఇదే సమయంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత్ పై. ఇండియా అనుసరిస్తున్న విదేశాంగ విధానం బాగుందని కితాబు ఇచ్చాడు. అయితే దేశంలో కొన్ని శక్తులు అభివృద్దికి ఆటంకంగా నిలిచాయని మండిపడ్డాడు.
ప్రధానంగా భారత్ తన ప్రజల బాగోగుల కోసం ప్రయత్నం చేస్తూనే ఉందన్నారు. వాటికే అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఖాన్ సాబ్. ఇతర దేశాలతో సత్ సంబంధాలు కూడా ఆ దిశగానే ఆలోచించి ముందుకు అడుగు వేస్తుందన్నాడు.
పాకిస్తాన్ లో భారత్ లాంటి పరిస్థితులు లేక పోవడం వల్లే ప్రతిసారి సంక్షోభ పరిస్థితులు నెలకొంటున్నాయని దీనికి ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నాడు ఇమ్రాన్ ఖాన్Imran Khan).
రష్యాతో చమురు కొనుగోలు చేయొద్దంటూ అమెరికా చెప్పిన సమయంలో భారత్ ఆ దేశాన్ని లెక్క చేయలేదన్నాడు. చివరకు యుఎస్ దిగి వచ్చిందని ఇది భారత్ కు ఉన్న బలమని కితాబు ఇచ్చాడు మాజీ పీఎం.
కాని పాకిస్తాన్ విదేశాంగ విధానం ఈ దేశ ప్రజల కంటే ఇతర దేశాలకు మేలు చేకూర్చేలా ఉండాలని అనుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : ఇల్హాన్ ఒమర్ ది అనధికార టూర్ – యుఎస్