Delhi CM : మాస్క్ లు ధరించ‌క పోతే జ‌రిమానా

స్ప‌ష్టం చేసిన ఆప్ ఢిల్లీ ప్ర‌భుత్వం

Delhi CM  : క‌రోనా కేసులు మెల మెల్ల‌గా పెరుగుతుండ‌డంతో ఆప్ డిల్లీ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టికే కొన్ని కేసులు న‌మోదు కావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రికీ ప‌రీక్ష‌లు చేయాల‌ని సంక‌ల్పించింది.

ప‌నిలో ప‌నిగా కోవిడ్ -19కి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎక్క‌డైనా స‌రే, దేశ రాజ‌ధానిలో బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో ప్ర‌తి ఒక్క‌రు మాస్కులు ధ‌రించాలని స్ప‌ష్టం చేసింది.

ఈ మేర‌కు ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఒక వేళ ఎవరైనా మాస్క్ లు ధిరంచ‌క పోతే వారికి రూ. 500 జ‌రిమానా విధిస్తామ‌ని హెచ్చ‌రించింది. దీనిని ప్ర‌తి ఒక్క‌రు పాటించాల‌ని ఆదేశించింది.

ప్రైవేట్ కార్ల‌లో ఉన్న వారికి మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది ప్ర‌భుత్వం . రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది.

అయితే ప్రైవేట్ కార్ల‌లో, వాహ‌నాల‌లో ప్ర‌యాణం చేసే వారికి మాస్క్ లు ధ‌రించ‌డం అన్న‌ది త‌ప్ప‌నిస‌రి కాద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా రూల్స్ పాటించాల‌ని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

కాగా ఇటీవ‌ల మార్గ‌ద‌ర్శ‌కాల‌ను స‌వ‌రించింది. క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో వాటిని ప‌ట్టించు కోలేదు. కానీ తాజాగా కేసులు పెరుగుతుండ‌డంతో తిరిగి మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.

ఎవ‌రైనా ఉల్లంఘించిన‌ట్ల‌యితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. ఈ విష‌యాన్ని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Delhi CM)  తెలిపారు.

ఇక ఢిల్లీకి ప‌క్క‌నే ఉన్న నోయిడాలో మాస్క్ లు ధ‌రించ‌ని 100 మందికి ఫైన్ వేశారు. మ‌ధ్యాహ్న భోజ‌నం, స్టేష‌న‌రీ వ‌స్తువుల‌ను పంచుకోకుండా విద్యార్థుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశామ‌న్నారు.

Also Read : స‌చిన్..అమితాబ్ బ‌చ్చ‌న్ లా అనిపించింది

Leave A Reply

Your Email Id will not be published!