Modi : రెండు సంవత్సరాల తర్వాత భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi )జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ఆగస్టు 2019 తర్వత జమ్మూ ,కాశ్మీర్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నియంత్రణ రేఖ వెంట ఉన్న సైనికులతో మోదీ సంభాషించారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో తన తొలి బహిరంగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
జమ్మూ ప్రాంతంలో బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో మోదీకి (Modi ) స్వాగతం పలికేందుకు వేలాది మంది తరలి వస్తున్నారు. అట్టడుగు ప్రజాస్వామ్యాన్ని స్మరించుకునే పంచాయతీ రాజ్ ను గుర్తు చేసే వేడుకకు ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కొత్త శకంలోకి నడిపిస్తారని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. 2019 తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ప్రధానమంత్రి తొలిసారిగా అధికారికంగా సభ నిర్వహించనున్నారు.
కేంద్ర పాలిత ప్రాంతంలోని రెండు ప్రాంతాల మధ్య అన్ని వాతావరణాల కనెక్టివిటీ కోసం బనిహాల్ – ఖాజిగుండ్ రోడ్డు సొరంగం తెరవడంతో సహా రూ. 20 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవాలు , శంకుస్థాపన చేస్తారు.
ఈ విషయాన్ని పీఎంఓ ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తంగా ప్రధాని పర్యటనపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మోదీ పర్యటనకు ముందు ఎన్ కౌంటర్ జరగడంతో సెక్యూరిటీ పెంచారు.
Also Read : భగవంత్ మాన్ నా సోదరుడు – సిద్దూ