KCR PK : పీకేతో టీఆర్ఎస్ కంటిన్యూ జ‌ర్నీ

ఒప్పందం చేసుకునేందుకు రెడీ

KCR PK : ఓ వైపు ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీతో జ‌త క‌ట్టేందుకు ప్లాన్ చేసుకుంటుండ‌గా ఇంకో వైపు టీఆర్ఎస్ అత‌డితో క‌లిసి జ‌ర్నీ చేసేందుకు ప్లాన్ చేస్తుండ‌డం విశేషం.

ఇప్పుడు ఇదే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన సీఎం కేసీఆర్ ఎందుక‌ని పీకేతో KCR PK)క‌లిసి సాగుతున్నార‌నేది ప్ర‌శ్న‌గానే మిగిలింది.

ఆయ‌న 80 వేల పుస్త‌కాలు చ‌దివారు. దేశం గురించి, రాష్ట్రం గురించి ఏది అడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేశారు. కానీ ఈసారి ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెల‌వాలంటే తీవ్రంగా క‌స‌ర‌త్తు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న సంగ‌తి గుర్తించారు.

దీనిని గుర్తించేలా, జాగ్ర‌త్త ప‌డేలా చేసింది మాత్రం ప్ర‌శాంత్ కిషోర్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. విచిత్రం ఏమిటంటే తెలంగాణ‌లో టీఆర్ఎస్ ను తీవ్రంగా ఎండ గ‌డుతోంది కాంగ్రెస్ పార్టీ. కానీ పీకే అటు కాంగ్రెస్ తో పాటు ఇత‌ర ప్రాంతీయ పార్టీల‌ను క‌లుపుకుని పోవాల‌ని సూచిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా 594 లోక స‌భ సీట్లు ఉండ‌గా ఇందులో 370 ఒంట‌రిగా పోటీ చేయాలని మిగ‌తా సీట్ల‌లో పొత్తు పెట్టు కోవాలంటూ బ్లూ ప్రింట్ లో సూచించాడు.

ఈ త‌రుణంలో నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతున్నది పోటీ. ఏపీలో జ‌గ‌న్ రెడ్డి, తెలంగాణ‌లో టీఆర్ఎస్ తో క‌లిసి పోటీ చేసే ఛాన్స్ లేదు. ఇప్ప‌టికే రాహుల్ గాంధీ తాము ఒంట‌రిగానే పోటీకి దిగుతామ‌ని స్ప‌ష్టం చేశాడు.

ఏది ఏమైనా సీఎం కేసీఆర్ ఐ ప్యాక్ తో క‌లిసి జ‌ర్నీ చేసేందుకు ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్లు స‌మాచారం. నిన్న రాత్రి పీకే రావ‌డం సీఎం కేసీఆర్ తో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

Also Read : ద‌ళిత బంధుపై ఫోక‌స్ పెట్టాలి – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!