KCR : ఓ వైపు సుదీర్ఘ రాజకీయ పార్టీగా పేరొందిన కాంగ్రెస్ పార్టీతో మంతనాలు. ఇంకో వైపు ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితితో ఒప్పందం.
అత్యంత నాటకీయ పరిణామాలు, ఆసక్తికరమైన చర్చలు. ఊహించని ట్విస్టులకు తెర దించే ప్రయత్నం చేశారు ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషర్ అలియాస్ పీకే.
ఆయన రెండు రోజులుగా గులాబీ దళపతితో చర్చలు జరిపారు. రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
ఇందుకు సంబంధించి సంతకాలు కూడా జరిగి పోయాయట. ఇప్పటికే పీకే కాంగ్రెస్ చీఫ్ కు బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఆ పార్టీ కంటే ముందు టీఆర్ఎస్ తో చర్చలు జరిపారు.
దీంతో తెలంగాణలో ఉప్పు నిప్పు లాగా ఉన్న కాంగ్రెస్ , టీఆర్ఎస్ ల మధ్య ఏం జరుగుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కేసీఆర్(KCR )దోస్తీ చేస్తారా లేక ఒంటరిగానే బరిలో నిల్చుంటారా అన్నది చూడాల్సి ఉంది.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 370 స్థానాలలో పోటీ చేయాలని, మిగతా 274 సీట్లను ఆయా ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేసుకోవాలని సూచించినట్లు టాక్. ఇదే విషయాన్ని ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చారు.
దీనిని ఆ పార్టీ ధ్రువీకరించింది కూడా. ఈ తరుణంలో తెలంగాణలో, ఏపీలో ఆయన స్టాండ్ ఏమిటో కూడా చెప్పేశాడట. ఏపీలో వైసీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టు కోవాలని, కానీ తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం.
ప్రస్తుతం డీల్ ఓకే కావడం రాజకీయాల్లో ప్రకంపనలు రేగాయి.
Also Read : కేంద్ర సర్కార్ పై కేటీఆర్ కన్నెర్ర