Modi Macron : ఫ్రాన్స్ దేశాధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యారు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్. ఆయనకు 58 శాతం ఓట్లు రాగా ప్రత్యర్థి తీవ్రవాద నాయకురాలు లే పెన్ కు 42 శాతం ఓట్లు వచ్చాయి.
ఇద్దరి మధ్య 16 శాతం ఓట్ల తేడా. దేశ వ్యాప్తంగా సంబురాలు ఓ వైపు నిరసనలు కూడా కొనసాగుతున్నాయి. చివరి దాకా లే పెన్ విజయం సాధిస్తుందని అనుకున్నారంతా.
కానీ అనూహ్యంగా మాక్రాన్ తన మార్క్ తో గెలుపొందడం విస్తు పోయేలా చేసింది. దీంతో యూరోప్ దేశాలన్నీ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశాయి ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల వైపు.
ఎందుకంటే రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ మధ్య పోరు మరింత ప్రాధాన్యతను సంతరించుకునేలా చేశాయి. ఈ సందర్భంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi) ప్రత్యేకంగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ను అభినందించారు.
ఆయన ట్విట్టర్ వేదికగా కంగ్రాట్స్ తెలిపారు. తనకు అత్యంత ఆత్మీయుడైన దేశాధినేతలలో ఫ్రాన్స్ చీఫ్ మాక్రాన్ కూడా ఒకరు. దీంతో మోదీ(Modi ) ట్వీట్ లో మై డియర్ ఫ్రెండ్ అంటూ సంబోధించారు.
అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు నీకు ప్రత్యేక అభినందనలు. ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశాన్ని పాలించాలని ఈ సందర్భంగా కోరారు మోదీ.
భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య మరింత బంధం బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు భారత దేశ ప్రధాన మంత్రి. ఇప్పటి వరకు మోదీ,
మాక్రాన్ ల మధ్య గాఢమైన స్నేహం ఉంది. దీంతో ఇప్పుడు మోదీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
Also Read : సాధికార కార్యాచరణ కమిటీ ఏర్పాటు