Tiranga Yatra : ఢిల్లీలో ‘హిందూ, ముస్లిం’ల తిరంగా యాత్ర‌

క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త 

Tiranga Yatra : ఢిల్లీలో మ‌త సామ‌ర‌స్యాన్ని చాటేలా హిందూ, ముస్లింలు క‌లిసి తిరంగా యాత్ర(Tiranga Yatra) చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌ర‌మంత‌టా భారీ ఎత్తున గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

వంద‌లాది మంది పోలీసులు మోహ‌రించారు. ఇప్ప‌టికే ఢిల్లీలోని జ‌హంగీర్ పూర్ లో ఈనెల 16న హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా ఊరేగింపు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది.

ఇరు వ‌ర్గాల మ‌ధ్య రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు నిందితుల‌ను ప్ర‌ధానంగా గుర్తించారు. అల్ల‌ర్లు చోటు చేసుకోవ‌డంపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది.

ఇదిలా ఉండ‌గా మ‌త సామ‌ర‌స్యాన్ని కాపాడేందుకు గాను శాంతి క‌మిటీ ఆధ్వ‌ర్యంలో తిరంగా యాత్ర చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఇందు కోసం పెద్ద ఎత్తున అనుమ‌తించ లేదు పోలీసులు.

ముందు జాగ్ర‌త్తగా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను కేవ‌లం 50 మందికి మాత్ర‌మే ప‌ర్మిష‌న్ ఇచ్చారు ఢిల్లీ పోలీసు. ఇందులో హిందూ, ముస్లింలు ఉన్నారు.

ఎక్క‌డ చూసినా పోలీసులే ఉన్నారు. ర్యాలీ సాఫీగా సాగేందుకు స‌హ‌క‌రించారు. కాగా అల్ల‌ర్ల‌కు గురైన జ‌హంగీర్ పురి లోని సి బ్లాక్ లో హిందువులు, ముస్లింలు శాంతి, సామ‌ర‌స్య సందేశాన్ని అందిస్తూ తిరంగా యాత్ర చేప‌ట్టారు.

భార‌త్ మాతాకీ జై అంటూ నినాదాలు ఇచ్చారు. త్రివ‌ర్ణ పతాకంపై పూలు చ‌ల్లారు మ‌రికొంద‌రు. కుశాల్ చౌక్ లో ప్రారంభ‌మైంది. కిలోమీట‌ర్ దాకా కొన‌సాగింది. మ‌నుషులు, మ‌తాల కంటే దేశం గొప్ప‌ది అని చాటేందుకు దీనిని చేప‌ట్టామ‌న్నారు.

Also Read : రైతుల‌ను ఆదుకోని రుణమాఫి

Leave A Reply

Your Email Id will not be published!