Revanth Reddy PK : పీకే కాంగ్రెస్ తో దోస్తీ టీఆర్ఎస్ తో కుస్తీ
స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy : తెలంగగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పై సంచలన కామెంట్స చేశారు. పీకే టీఆర్ఎస్ తో డీల్ కుదుర్చుకున్నాడంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశాడు.
ఆయన తెలంగాణ రాష్ట్ర సమితితో తెగ దెంపులు చేసుకునేందుకే ఇక్కడికి వచ్చారని, అందులో భాగంగానే సీఎంను కలిశారని చెప్పారు. సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
పీకే వ్యవహారం, ప్రచారంపై స్పందించారు. ప్రశాంత్ కిషోర్ కు గులాబీ దళానికి ఎలాంటి బంధం ఉండదన్నారు. ఐ ప్యాక్ కు పీకేకు మధ్య కూడా ఎలాంటి రిలేషన్ షిప్ లేదన్నారు.
తాను ఇదే విషయాన్ని ముందు నుంచీ చెబుతూ వస్తున్నానని చెప్పారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ప్రశాంత్ కిషోర్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోస్యం చెప్పారు.
తెలంగాణ రాష్ట్రానికి వస్తారని వెల్లడించారు. తనతో కలిసి ఉమ్మడిగా మీడియాతో కూడా మాట్లాడతారంటూ వెల్లడించారు. ఆరోజు ప్రశాంత్ కిషోర్ స్వయంగా టీఆర్ఎస్ ను ఓడించండంటూ పిలుపు ఇస్తారని, అది మీరు స్వయంగా వింటారని అన్నారు రేవంత్ రెడ్డి.
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరాక పార్టీ హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యంగా ఉంటుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు టీపీసీసీ చీఫ్.
ఇక తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం తమతోనే పీకే ఉంటాడని అంటోంది. ఇప్పటికే ఆ పార్టీ చీఫ్ , సీఎం కేసీఆర్ మీడియా సాక్షిగా డిక్లేర్ కూడా చేశారు. ఈ తరుణంలో రేవంత్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : కాంగ్రెస్ మునిగి పోతున్న పడవ – కేటీఆర్