YS Jagan : పురుగు మందులు లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సాహించాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందన్నారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి.
అందుకే తాము అధికారంలోకి వచ్చాక నేచరుల్ ఫార్మింగ్ ను ప్రోత్సహిస్తూ వస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల శ్రేయస్సు కోసం పని చేస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా రైతులకు ఎనలేని మేలు జరుగుతోందన్నారు. ఇక్కడ రైతులకు సలహాలు, సూచనలు, శిక్షణలు అందజేస్తున్నట్లు తెలిపారు సీఎం జగన్ రెడ్డి(YS Jagan ).
ఇదిలా ఉండగా సహజ, ప్రకృతి వ్యవసాయ పద్దతులు, సాగు విధానాలపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏపీ సీఎం పాల్గొన్నారు. పలు సూచనలు చేశారు.
తాడేపల్లి గూడెం లోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు సీఎం. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు సాగు కోసం పెట్టుబడి కింద రైతులకు కోట్లాది రూపాయలు ఇచ్చామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన వాటిని ఆర్బీకేల ద్వారా అందజేస్తున్నామని అన్నారు సీఎం.
ఇందుకు గాను నేచురల్ ఫార్మింగ్ పై మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు గాను మరింత ప్రోత్సహించేలా, రైతులను చైతన్యవంతం చేసేందుకు, ఆ దిశగా సాగు చేసేందుకు గాను భారీ ఎత్తున కేంద్రం నిధులు ఇవ్వాలని సూచించారు.
ఇదిలా ఉండగా ఆర్బీకేల పని తీరును ప్రశసించారు నీతి ఆయోగి చైర్మన్ .
Also Read : కాంగ్రెస్‌తో జగన్ `పొత్తు` పై `పీకే` వ్యూహమేంటి?