Jignesh Mevani : ప్రధాని నరేంద్ర మోదీపై ఉద్దేశ పూర్వకంగా ట్వీట్లు చేశారంటూ గుజరాత్ రాష్ట్రానికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని(Jignesh Mevani) అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది అప్రజాస్వామికమని, రాజ్యాంగానికి విరుద్దమంటూ పేర్కొన్నారు మేవానీ.
ఇదిలా ఉండగా సోమవారం అరెస్ట్ అయిన జిగ్నేష్ మేవానీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇదిలా ఉండగా ఈనెల 20న జిగ్నేష్ మేవానీని అస్సాం ఖాకీలు గుజరాల్ లోని పాలన్ పూర్ సర్క్యూట్ హౌస్ లో అరెస్ట్ చేశారు.
అక్కడి నుంచి అహ్మదాబాద్ కు తరలించారు. అక్కడి నుంచి అస్సాంలోని గౌహతికి తీసుకు వెళ్లారు. అయితే జిగ్నేష్ మేవానీని అరెస్ట్ చేయడంపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది.
కావాలని, కక్ష పూరితంగా ఇబ్బందులకు గురి చేయాలనే జిగ్నేష్ మేవానీని అరెస్ట్ చేశారంటూ ఆరోపించింది కాంగ్రెస్. ఆయన ఇండిపెండెంట్ గా గెలిచినా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బయటి నుంచి మద్దతు ఇచ్చారు.
దీంతో తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ జిగ్నేష్ మేవానీ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
కోక్రాఝుర్ లో నమోదైన కేసుకు సంబంధించి బెయిల్ మంజూరైనట్లు జిగ్నేష్ మేవానీ తరపు న్యాయవాది వెల్లడించారు. కాగా బార్ పేట జిల్లాలో ప్రత్యేక కేసు నమోదైంది.
అక్కడి నుంచి అరెస్ట్ చేసి ఆ జిల్లాకు తీసుకు వెళ్లే చాన్స్ ఉంది. ప్రధానిని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన ట్వీట్లు చేసినందుకు అస్సాం బీజేపీ నేత అరూప్ కుమార్ డే అతడిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దీంతో అరెస్ట్ కావడం జరిగింది.
Also Read : ప్రధాని మోదీతో ఈయూ చీఫ్ భేటీ