Devendra Fadnavis : హనుమాన్ చాలీసా పఠనం వ్యవహారం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఇప్పటికే సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇంటి ముందు ఆందోళనకు దిగిన స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ , ఎమ్మెల్యే రవి రాణా వ్యవహారం అరెస్ట్ చేసే దాకా వెళ్లింది.
బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు కోలుకోలేని షాక్ తగిలింది. వారికి 14 రోజుల కస్టడీ కి పంపింది కోర్టు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis )స్పందించారు.
దేశ వ్యాప్తంగా హనుమంతుడిని కొలుస్తారని కానీ మరాఠాలో మాత్రం అందుకు విరుద్దంగా జరుగుతోందంటూ ఆరోపించారు. ఇది పూర్తిగా కావాలని చేస్తున్నట్టుగా అర్థమవుతోందన్నారు.
ఆయన మహా వికాస్ అఘాడి సర్కార్ ను నిందించారు. ఉద్దవ్ థాకరే ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
అమరావతి ఎంపీ, ఎమ్మెల్యే దంపతులు నవనీత్ కౌర్, రవి రాణాలపై దేశ ద్రోహం కేసులు పెడితే ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోవంటూ హెచ్చరించారు.
తామంతా కలిసి హనుమాన్ చాలీసా ఆలాపిస్తామని అన్నారు. ఫడ్నవీస్ తన నివాసం ముందు తనతో కలిసి హనుమాన్ చాలీసా పాడాలని ఎన్సీపీ కార్యకర్తలను కోరారు.
మీరంతా హిందువులు. తాము ప్రతిరోజూ హనుమాన్ చాలీసా జపిస్తూనే ఉంటామన్నారు. ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తుందో లేదా చూడాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు.
లేక పోతే తమ వ్యూహాన్ని అమలు చేసి తీరుతామని స్పస్టం చేశారు దేవేంద్ర ఫడ్నవిస్.
Also Read : సాధికార కార్యాచరణ కమిటీ ఏర్పాటు