Jos Butler : ఐపీఎల్ 2022 మెగా రిచ్ టోర్నీలో దుమ్ము రేపుతున్న క్రికెటర్లలో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ , స్టార్ హిట్టర్ జోస్ బట్లర్(Jos Butler )టాప్ లో ఉన్నాడు.
ఇప్పటి వరకు ఆ జట్టు 7 మ్యాచ్ లు ఆడింది 2 మ్యాచ్ లలో ఓడి పోయింది. 5 మ్యాచ్ లలో గెలుపొందింది. ఈ లీగ్ లో మూడు సెంచరీలు చేశాడు సత్తా చాటాడు బట్లర్. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.
ఏ ఒక్క బౌలర్ ను వదిలి పెట్టడం లేదు. టోర్నీలో భాగంగా ఆరెంజ్ క్యాప్ రేసులో మొదటి ప్లేస్ లో కొనసాగుతున్న బట్లర్ మొత్తం ఇప్పటి వరకు 491 పరుగులు చేశాడు.
ఆ తర్వాతి ప్లేస్ లో లక్నో సూపర్ జెయింట్స్ స్కిప్పర్ కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఇదిలా ఉండగా అరివీర భయంకరంగా, దెబ్బ తిన్న పులిలా అటాకింగ్ ఆట ఆడుతూ వస్తున్న జోస్ బట్లర్(Jos Butler )విధ్వంసం వెనుక ఎవరున్నారనే దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అయితే మనోడు తన ఫామ్ వెనుక ఉన్న కారణం ఏమిటో పంచుకున్నాడు బట్లర్. తన దూకుడు వెనుక మాజీ పాకిస్తాన్ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్ అని స్పష్టం చేశాడు.
తన కెరీర్ లో ప్రధానంగా స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడ్డానని తెలిపాడు. బలహీనతలు ఏమిటో ముందుగా తనకు తెలియ చేశాడన్నాడని జోస్ బట్లర్ పేర్కొన్నాడు.
ముస్తాక్ అహ్మద్ ఆఫ్ సైడ్ లో ఆడమని చెప్పాడు. లెగ్ సైడ్ ఆడేందుకు ట్రై చేయమని సూచించాడు. దీంతో తన బ్యాటింగ్ స్టైల్లో మార్పు చోటు చేసుకుందన్నాడు. ఇదిలా ఉండగా 2008 నుంచి 2014 వరకు బౌలింగ్ కోచ్ గా పని చేశాడు.
Also Read : రషీద్ ఖాన్ కేర్ టేకర్ కాదు – లారా