OU Foundation Day : భారత దేశంలో అత్యున్నతమైన విశ్వ విద్యాలయాలలో టాప్ లో నిలుస్తూ వస్తోంది ఉస్మానియా యూనివర్శిటీ(OU Foundation Day). ఏప్రిల్ 26న 1917లో అప్పటి 7వ నిజాం నవాబ్ మీర ఉస్మాన్ అలీఖాన్ ఫర్మాన్ జారీ చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ డే నిర్వహించారు. 105 వసంతాలు పూర్తి చేసుకున్న ఓయూలో కోటి మందికి పై ఇప్పటి వరకు చదువుకున్నారు.
దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన వేలాది కంపెనీలలో అత్యున్నత స్థానాలలో కొలువుదీరారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తుంది. దేశంలోనే 7వ విశ్వ విద్యాలయంగా చరిత్ర సృష్టించింది.
తొలిసారి ఓయూలో వ్యవస్థాపక దినోత్సవాన్ని గర్వంగా ఉందన్నారు యూనివర్శిటీలో చదువుకున్న పూర్వ విద్యార్థులు. ఆనాటి వందేమాతరం నుంచి నిన్నటి దాకా ప్రపంచాన్ని విస్మయ పరిచిన తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్శిటీ వేదికగా, కేంద్రంగా నిలిచింది.
దేశానికి ప్రధాన మంత్రిగా పీవీ నరసింహారావు, దివంగత సూదిని జైపాల్ రెడ్డి, ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ , తదితరులు ఇక్కడ చదువుకున్న వారే. 1934లో ఆర్ట్స్ కాలేజీ భవన నిర్మాణానికి నిజాం నవాబ్ ప్రారంభించారు.
రెండున్నర లక్షల విద్యార్థులు డిగ్రీలు, పీజీ, పీహెచ్ డి దూర విద్య, రెగ్యులర్ కోర్సులు చదువుతున్నారు. 87 దేశాలకు చెందిన విదేశీ విద్యార్థులు ఓయూలో చదువుకుంటున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకున్నారు. ఇందులో 70 శాతం మహిళలు ఉన్నారు. అన్ని రంగాలలో పేరొందిన టాప్ పర్సనాలిటీస్ ను ఉస్మానియా యూనివర్శిటీ తయారు చేసింది.
దేశాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఉన్నత స్థానాలలో ఉండేలా చూసింది.
Also Read : యూజీసీ సంచలన నిర్ణయం