Elon Musk : ఇది ఊహించని షాక్. ప్రపంచంలోని అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ అనుకున్నది సాధించాడు. ఆయన ఒక్కసారి డిసైడ్ అయ్యాడంటే, కన్నేశాడంటే ఇక వశం కావాల్సిందే.
ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియా దిగ్గజం , మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను కైవసం చేసుకున్నాడు. ఏకంగా రూ. $44 బిలియన్లకు కొనుగోలు చేసింది.
ఈ మేరకు ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ నిర్ణయం అన్ని స్టాక్ మార్కెట్ లలో ప్రభావం చూపింది. కోట్లాది మంది నిత్యం పిట్ట కూతలో నిత్యం సంభాషిస్తూ, అభిప్రాయాలు పంచుకుంటూ, పోస్ట్ లు షేర్ చేస్తూ వస్తున్నారు.
ఊహించని రీతిలో కోలుకోలేని షాక్ ఇచ్చారు టెస్లా సీఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్(Elon Musk ). స్వేచ్ఛా ప్రసంగం అనేది పని చేసే ప్రజాస్వామ్యానికి పునాది.
ట్విట్టర అనేది డిజిటల్ టౌన్ స్క్వేర్. ఇక్కడ మానవాళి భవిష్యత్తుకు సంబంధంచిన కీలకమైన విషయాలు చర్చించబడతాయి అంటూ ఎలోన్ మస్క్(Elon Musk )విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఇక నుంచి పెను మార్పులు చోటు చేసుకుంటాయని వెల్లడించాడు. ఇప్పటి కాగా పబ్లిక్ సంస్థ. ఇక నుంచి ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ప్రైవేట్ కంపెనీగా మారనుంది.
ఒక్కో షేరుకు $54.20 చొప్పున కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా ట్విట్టర్ ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే ఉద్దేశం , ఔచిత్యాన్ని కలిగి ఉంది.
ఇక్కడ పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు ట్విట్టర్ సిఇఓ పరాగ్ అగర్వాల్ ట్వీట్ చేశాడు. వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్ లో 5.9 శాతం అధికంగా ట్రేడ్ అవుతోంది.
Also Read : బ్రిటన్ ప్రధాని జాన్సన్ తో అదానీ భేటీ