Sakshi Dhoni: విద్యుత్ సంక్షోభంపై ధోనీ భార్య ఫైర్

స‌ర‌ఫరా అంతరాయం ఎందుకు

Sakshi Dhoni : దేశ వ్యాప్తంగా ఎండ‌లు మండుతున్నాయి. అగ్నిగోళాల‌ను త‌ల‌పింప చేస్తున్నాయి. ఓ వైపు అకాల వ‌ర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని ప‌లు రాష్ట్రాల‌లో విద్యుత్ కోత‌లు జ‌నాన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి.

తాజాగా విద్యుత్ స‌ర‌ఫ‌రా సంక్షోభంపై ప్ర‌ముఖ క్రికెట‌ర్ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ సాక్షి ధోనీ (Sakshi Dhoni)ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వాన్ని ఆమె నిల‌దీశారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు ఎందుకు తీసుకోలేదంటూ ప్ర‌శ్నించారు.

జార్ఖండ్ లో విద్యుత్ సంక్షోభం ఎందుకు ఉందంటూ ఆవేశంగా పేర్కొన్నారు. సాక్షి ధోనీ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఆమె చేసిన ట్వీట్ క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని, పూర్తిగా బాధ్య‌త‌ను విస్మ‌రించిన‌ట్లేన‌ని పేర్కొంది.

విద్యుత్ స‌ర‌ఫ‌రా, సంక్షోభం గురించి ముంద‌స్తు ప్లాన్ చేసుకోలేదంటూ క‌డిగి పారేసింది. ఇదిలా ఉండ‌గా జార్షండ్ రాష్ట్రంలో చాలా చోట్ల 40 డిగ్రీల సెల్సియ‌స్ కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి.

దీంతో తీవ్ర విద్యుత్ అంతరాయం, కొర‌త‌తో తంటాలు ప‌డుతున్నారు. దీంతో దీనిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు సాక్షి ధోనీ. జార్ఖండ్ కు చెందిన ప‌న్ను చెల్లింపుదారుగా చాలా సంవ‌త్స‌రాల నుంచి విద్యుత్ సంక్షోభం ఎందుకు ఉందో తెలుసు కోకూడ‌దంటూ ప్ర‌శ్నించింది.

సింగ్ భూమ్ , కోడెర్మా, గిరిడిహ్ జిల్లాల‌లో కొర‌త తీవ్రంగా ఉంది. 28 నాటికి రాంచీ, బొకారో, తూర్పు సింగ్ భూమ్ , గ‌ర్వా, పాల‌ము, చ‌త్రాల‌కు వ్యాపించే అవ‌కాశం ఉంది. విద్యుత్ ప్లాంట్ల‌కు బొగ్గు స‌ర‌ఫ‌రా లేక పోవ‌డం వ‌ల్ల , పెరిగిన ఇంధ‌న ధ‌ర‌ల కార‌ణంగా విద్యుత్ కోత ఏర్ప‌డింది.

Also Read : మ‌హారాష్ట్ర స‌ర్కార్ పై ఫ‌డ్న‌వీస్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!