Taliban Warns : పాకిస్తాన్ అదే పనిగా వైమానిక దాడులకు దిగుతోందని, ఇంకోసారి దాడులకు తెగబడితే తవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆఫ్గనిస్తాన్ వార్నింగ్(Taliban Warns) ఇచ్చింది.
పాకిస్తాన్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పటికే పాక్ జరిపిన వైమానిక దాడుల్లో 60 మంది సాధారణ ఆఫ్గన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.
ఇది పూర్తిగా అంతర్జాతీఈయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా 2021లో ఆఫ్గనిస్తాన్ లో తాలిబాన్ ఇస్లామిస్ట్ పాలనను స్థాపించడంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ , అప్పటి ఐఎస్ఐ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ చురుకైన పాత్ర పోషించారు.
కాగా కాబూల్ పై వైమానిక దాడులకు తెగబడడం ద్వారా దాని ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించిందంటూ పాకిస్తాన్ పై యుఎన్ భద్రతా మండలి దృష్టికి తీసుకు వెళ్లింది. ఈనెల 16న కునార్ , ఖోస్ట్ ప్రావిన్స్ పై దాడులకు పాల్పడింది.
ఆఫ్గాన్ ప్రతినిధి నసీర్ అహ్మద్ ఫైక్ పాకిస్తాన్ పై అధికారికంగా ఫిర్యాదు చస్త్రశారు. తాలిబాన్ , హక్కాన నెట్ వర్క్ , తెహ్రీక్ ఇ తాలిబాన్ , పాకిస్తాన్ లోని కొందరు మహిళలు 40 మందికి పైగా వైమానిక దాడులను వ్యతిరేకించారు.
యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కు పంపిన లేఖలో ఆఫ్గనిస్తాన్ చార్డ్ డి వ్యవహారాలు, వైమానిక దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయంటూ తెలిపింది.
ఆఫ్గనిస్తాన్ లోపట సైనిక పోస్టులు, కంచెల నిర్మాణం ద్వారా పాకిస్తాన్ సైనిక దళాలు ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నాయంటూ ఆరోపించారు లేఖలో.
Also Read : భారత్ కు స్వంత సమస్యలున్నాయి