Hardik Patel : గత కొంత కాలం నుంచీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులలో ఒక వర్గం తనను టార్గెట్ చేస్తోందని, తాను వెళ్లి పోయేలా పావులు కదుపుతోందంటూ ఆరోపించారు. అంతే కాదు ఈ విషయం గురించి తాను ఎన్నిసార్లు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.
మంగళవారం హార్దిక పటేల్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ను విడిచి పెట్టేలా, తన నైతికతను విచ్ఛిన్నం చేసేలా కొందరు యత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో తాను కొనసాగేందుకు మార్గం సుగమం చేయాల్సిన బాధ్యత పార్టీ హైకమాండ్ పై ఉందన్నారు. ఇదిలా ఉండగా 2017 రాష్ట్రంలో ఎన్నికలకు ముందు హార్దిక్ పటేల్ (Hardik Patel) కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అంతకు ముందు బలమైన పాటిదార్ వర్గం కోసం ఆందోళన చేపట్టారు. కొంత కాలంగా ఆయన పార్టీకి సంకేతాలు పంపుతున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది సమయం మాత్రమే ఉండడంతో హార్దిక్ పటేల్(Hardik Patel) తరుచూ కామెంట్స్ చేస్తుండడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
పార్టీ నాయకత్వానికి ఆందోళనకర సంకేతాలు పంపుతున్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన పటేల్ కు పార్టీ సముచిత స్థానం కలిపించింది.
నాయకత్వం తనను పక్కకు పెట్టిందంటూ ఆరోపించారు. ఇదే సమయంలో పార్టీ లో నా స్థానం వేసెక్టమీ చేయించుకున్న కొత్త వరుడి పరిస్థితిలా ఉందన్నారు.
Also Read : చాలీసా పేరుతో ఇబ్బంది కలిగించొద్దు