Rajasthan Royals : రాజ‌స్థాన్ రాజసం స‌మిష్టికి సంకేతం

అద్భుత విజ‌యం న‌మోదు చేసిన వైనం

Rajasthan Royals  : గ‌త ఐపీఎల్ సీజ‌న్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. కానీ ఆశించిన మేర రాణించ లేక పోయింది. జ‌ట్టు మేనేజ్ మెంట్ కీల‌క మార్పు చేసింది.

శ్రీ‌లంక క్రికెట్ దిగ్గ‌జం కుమార సంగ‌క్క‌ర‌కు డైరెక్ట‌ర్ ప‌ద‌వి క‌ట్టబెట్టింది. జ‌ట్టును ఎంపిక చేయ‌డంతో పాటు ఆట‌గాళ్ల ఆట తీరును మార్చ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు.

ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ 8 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 6 మ్యాచ్ లు గెలుపొందింది. 2 మ్యాచ్ ల‌లో ఓడింది. ర‌న్ రేట్ ప‌రంగా టాప్ లో నిలిచింది. భారీ స్కోర్ సాధించిన జ‌ట్ల‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టాప్ లో ఉంది.

222 ర‌న్స్ చేసింది ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై. ఇదే స‌మ‌యంలో ఐపీఎల్ టోర్నీలో ఎంతో ప్ర‌ముఖంగా భావించే ఆరేంజ్ క్యాప్, ప‌ర్పుల్ క్యాప్ ల‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు(Rajasthan Royals చెందిన ఆట‌గాళ్లు జోస్ బ‌ట్ల‌ర్ , యుజ్వేంద్ర చాహ‌ల్ ఉన్నారు.

బ‌ట్ల‌ర్ ఇప్ప‌టి దాకా 500 ప‌రుగులు చేస్తే చాహ‌ల్ 18 వికెట్లు కూల్చాడు. సంజూ శాంస‌న్ కెప్టెన్ గా మెల మెల్ల‌గా పుంజుకుంటున్నాడు. ఎక్క‌డా ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించ‌కుండా కామ్ గా, కూల్ గా త‌న‌ప‌ని తాను చేసుకుంటూ పోతున్నాడు.

బ్యాటింగ్ ప‌రంగా కొంత ఇబ్బంది ప‌డుతున్న‌ప్ప‌టికీ జోస్ బ‌ట్ల‌ర్ దెబ్బ‌కు ప్ర‌త్య‌ర్థి జ‌ట్లు జంకుతున్నాయి బౌలింగ్ చేసేందుకు. ఇక బ్యాటింగ్ ప‌రంగానే కాదు బౌలింగ్ ప‌రంగా కూడా రాజ‌స్థాన్ రాణిస్తోంది.

కుల్దీప్ సేన్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్ , చ‌హ‌ల్ , త‌దిత‌రులు ఉండ‌నే ఉన్నారు. మొత్తంగా రాజ‌స్థాన్ రాజ‌సాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. స‌మిష్టికి సంకేతంగా నిలుస్తోంది.

Also Read : నేను విఫ‌లం కావాల‌ని కోరుకున్నారు

Leave A Reply

Your Email Id will not be published!