Donald Trump : నోరు పారేసు కోవడంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తర్వాతే ఎవరైనా. ఆయన ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తూ వచ్చారు. అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హింసను ప్రేరేపించారనే ఆరోపణలపై సోషల్ మీడియా నిషేధం విధించింది.
కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చాయి గూగుల్, యూట్యూబ్, ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్ , ట్విట్టర్. దీంతో ట్రంప్ వాటన్నింటికి వ్యతిరేకంగా ట్రూత్ అనే సోషల్ మీడియా ను స్టార్ట్ చేశారు.
ఆయన పదవి నుంచి దిగి పోయినా విమర్శలు చేయడం మానడం లేదు. ఓ వైపు బైడెన్ ను ఇంకో వైపు రష్యా చీఫ్ పుతిన్ ను చెడుగుడు ఆడుతున్నారు.
చాలా సార్లు పుతిన్ కు మద్దతు తెలుపుతూ వచ్చిన ట్రంప్ ఉన్నట్టుండి రూట్ మార్చాడు. సంచలన కామెంట్స్ చేశాడు. పియర్స్ మోర్గాన్ అన్ సెన్సార్డ్ పేరుతో జరిగిన ఇంటర్వ్యూలో ఒక వేళ ప్రెసిడెంట్ స్థానంలో మీరు గనుక ఉంటే ఉక్రెయిన్, రష్యా యుద్దంపై ఎలా స్పందించే వారని, ఎలాంటి నిర్ణయం తీసుకునే వారని అడిగారు.
దీనికి డిఫరెంట్ గా సమాధానం ఇచ్చారు ట్రంప్(Donald Trump). ఈ పరిణామాలను ఆధారంగా చేసుకుని పుతిన్ కు చుక్కలు చూపించి ఉండేవాడినంటూ సమాధానం ఇచ్చారు.
పుతిన్ పనిగట్టుకుని ప్రపంచాన్ని భయ పెట్టాలని చూస్తున్నాడు. అణ్వాయుధాలు ప్రయోగిస్తానంటూ బెదిరిస్తూ వస్తున్నాడు. నేనైతే డోంట్ కేర్ అనే వాడినంటూ పేర్కొన్నాడు.
రష్యా కంటే ఎక్కువ ఆయుధ సంపత్తి, ఆర్మీ బలం అమెరికా వద్ద ఉందని హెచ్చరించే వాడినంటూ పేర్కొన్నారు.
Also Read : పాకిస్తాన్ పై ఆఫ్గానిస్తాన్ కన్నెర్ర