Elon Musk : ప‌రిమితికి మించిన స్వేచ్ఛ ప్ర‌మాదం

సెన్షార్ షిప్ కు తాను వ్య‌తిరేకం

Elon Musk : టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఆయ‌న ట్విట్ట‌ర్ ను స్వాధీనం చేసుకున్నాడు. ఈ త‌రుణంలో అన్ని వైపులా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

దీనిపై స్పందించారు మ‌స్క్(Elon Musk). ట్విట్ట‌ర్ ను ఎందుకు డీల్ చేయాల్సి వ‌చ్చిందో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. తాను ఒక్క‌సారి డిసైడ్ అయ్యాడంటే వెనుదిరిగేది ఉండ‌ద‌న్నాడు.

స్వేచ్ఛ అన్న‌ది ప‌రిమితికి లోబ‌డి ఉండాల‌ని సూచించాడు. స్వేచ్ఛ పేరుతో రాజ‌కీయం చేస్తానంటే ఒప్పుకోన‌ని పేర్కొన్నాడు. భారీ ఆఫ‌ర్ ఇచ్చి కొనుగోలు చేశాడు ఎలోన్ మ‌స్క్.

స్వేచ్ఛ గురించి ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. సోష‌ల్ మీడియాలో టాప్ లో కొన‌సాగుతోంది మైక్రో బ్లాగింగ్ ట్విట్ట‌ర్. ఇదిలా ఉండ‌గా సంస్థ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది ఆందోళ‌న చెందుతున్నారు.

సిఇఓ ప‌రాగ్ అగ‌ర్వాల్ ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అనిశ్చితి కొన‌సాగుతుంద‌ని, ఇది ఆరు నెల‌ల దాకా కొన‌సాగే చాన్స్ ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

మొత్తంగా ట్విట్ట‌ర్ పూర్తిగా ఎలోన్ మ‌స్క్ (Elon Musk)ప‌ర‌మైంది. దీంతో ఎలోన్ మ‌స్క్ తాను సెన్షార్ షిప్ మించి స్వేచ్ఛ ఉండ కూడ‌ద‌ని పేర్కొన‌డం క‌ల‌కలం రేపింది.

స్వేచ్ఛ‌గా మాట్లాడేందుకు భ‌య‌ప‌డే వారి గురించి కూడా కామెంట్ చేశాడు ఎలోన్ మ‌స్క్. 44 బిలియ‌న్ల‌కు ట్విట్ట‌ర్ ను చేజిక్కించుకున్నాడు.

ఈ మేర‌కు ట్విట్ట‌ర్ తో ఒప్పందం చేసుకున్నాడు టెస్లా సిఇఓ, చైర్మ‌న్. స్వేచ్ఛ అంటే చ‌ట్టానికి స‌రిపోయేది అని నా ఉద్దేశం. చ‌ట్టానికి మించిన సెన్సార్ షిప్ కి వ్య‌తిరేకం.

Also Read : ట్విట్ట‌ర్ పై మా స్టాండ్ మార‌దు : చంద్ర‌శేఖ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!