KCR : హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగుర వేశారు సీఎం కేసీఆర్(KCR ). అనంతరం ప్రసంగించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి నేటితో 21 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. 22వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు కేసీఆర్(KCR )అభినందనలు తెలిపారు.
పార్టీ కంటే ఉద్యమంగా ప్రారంభమైంది. ఆనాడు అంతా గేలి చేసిన వాళ్లే. నిందించిన వాళ్లే. కానీ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ముందుకు సాగాం. ప్రపంచం నివ్వెర పోయేలా ఉద్యమించాం. అనుకున్నది , రాదనుకున్న రాష్ట్రాన్ని తీసుకు వచ్చిన ఘనత తనదేనని చెప్పారు.
ఇవాళ అవాకులు, చెవాకులు పేలుతున్న వారికి ఉద్యమ నేపథ్యం లేదని, వారికి ఉద్యమ చరిత్ర కాదన్నారు. 80 శాతం మంది పరిపాలనా భాగస్వాములుగా ఉన్న ప్రజా ప్రతినిధులతో 60 లక్షల మంది సభ్యులతో రూ. 1000 కోట్ల ఆస్తులు కలిగి ఉన్న సంస్థగా పార్టీ ఎదిగిందన్నారు.
లక్ష్యాన్ని ముద్దాడాం. రాష్ట్ర సాధన సాధించాం. ఇక మిగిలింది ఒక్కటే బంగారు తెలంగాణ. దానిని కూడా పూర్తి చేసుకునే దశలో ఉన్నామని చెప్పారు కేసీఆర్.
ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వంలో ఇవాళ తెలంగాణ సగర్వంగా నిలబడ్డదన్నారు సీఎం. రాబోయే కాలం కూడా మనదేనని జోష్యం చెప్పారు కేసీఆర్.
తెలంగాణ కాపాలదారుగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉంటుందని చెప్పారు కేసీఆర్. ఎవరూ ఏ శక్తి బద్దలు కొట్ట లేని కంచుకోట అని నినదించారు.
Also Read : పీకేతో గులాబీ దళం ఒప్పందం