KCR : టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్ లు కాదన్నారు. కావాల్సిందల్లా ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. సంకల్పం ఉంటే దేనినైనా సాధించ గలమని తాను నిరూపించానని చెప్పారు.
ఒకనాడు ఒక్కడినే ఒంటరిగా బయలు దేరిన. అంతా గేలి చేసిన వాళ్లే. విమర్శించిన వాళ్లే. రాళ్లు వేసిన వాళ్లే. కానీ ఒక్క అడుగు ముందుకే కదిలింది.
దాని వెనుక నాలుగున్నర కోట్ల జనం కదిలింది. ఒకటే జననం ఒకటే మరణం అన్న రీతిలో ముందుకే సాగాం. కేంద్రం మెడలు వంచాం. అనుకున్నది సాకారం అయ్యేలా చేశాం.
ఇదంతా ఎక్కడో జరిగింది కాదు. సాక్షాత్తు తెలంగాణలో జరిగిన చరిత్ర. రాదన్నారు, కాదన్నారు. ఎందుకన్నారు రాష్ట్రం. కానీ అన్నింటిని తట్టుకుని నిలబడ్డాం. పాలించడమే చేత కాదన్నారు.
ఇప్పుడు దేశం మనల్ని చూసి పాలిస్తోందన్నారు. మనం అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను కేంద్రం కాపీ కొడుతోందని ఆరోపించారు.
అద్భుతమైన ప్రతి పథంలో తీసుకు వెళ్లే ఎజెండా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్(KCR). 11 రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వస్తున్నారని అన్నారు సీఎం. తెలంగాణలో కావాల్సినంత పని దొరుకుతోందన్నారు.
ఒకప్పుడు పాలమూరు జిల్లా నుంచి వలసలు ఉండేవి. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉపాధికి ఢోకా లేకుండా పోయిందన్నారు కేసీఆర్. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని చెప్పారు.
Also Read : తెలంగాణ తల్లీ నీకు వందనం